- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రధాని మోడీతో రాహుల్ గాంధీ భేటీ.. ఆ అంశంపైనే చర్చ
by Gantepaka Srikanth |
ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi)తో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) భేటీ అయ్యారు. సీబీఐ డైరెక్టర్(CBI Director) ఎంపికపై చర్చించారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi)తో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) భేటీ అయ్యారు. సీబీఐ డైరెక్టర్(CBI Director) ఎంపికపై చర్చించారు. వీరితో పాటు సీజేఐ సంజీవ్ ఖన్నా కూడా సమావేశంలో పాల్గొన్నారు. ఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయంలో వీరు భేటీ అయ్యారు. కాగా, కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) నూతన డైరెక్టర్‌ను ఎంపిక చేసే పనిలో కేంద్ర ప్రభుత్వం నిమగ్నమైంది. ఇటీవలే నూతన డైరెక్టర్ కోసం ప్రధాని నరేంద్ర మోడీ నివాసాంలో అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. కొత్త డైరెక్టర్ కోసం ఇప్పటికే చాలా మంది పేర్లను పరిశీలించి, అందులో కొందరితో తుది జాబితాను రూపొందించినట్లు సమాచారం. అయితే వీరిలో ఒకరిని సీబీఐ అత్యున్నత పదవికి ఎంపిక చేయనున్నారు. ఎవరనే దానిపై వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ భేటీపై కాసేపట్లో పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.
Next Story






