- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TMC ఓటమి.. సొంత పార్టీ నేతలపై రాహుల్ గాంధీ అసహనం
బెంగాల్, అస్సాం ఎన్నికల ఫలితాలపై రాహుల్ గాంధీ హాట్ కామెంట్స్ చేశారు. టీఎంసీ ఓటమిపై హర్షం వ్యక్తం చేసిన కాంగ్రెస్ నేతలపై ఆగ్రహం. నెటిజన్ల కౌంటర్!

దిశ, డైనమిక్ బ్యూరో: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తృణమూల్ కాంగ్రెస్ ఓటమిపై సొంత పార్టీలో కొందరు నేతల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. టీఎంసీ (TMC) ఓటమిని చూసి కొందరు కాంగ్రెస్ నేతలు మురిసిపోతున్నారని మండిపడ్డారు. ఇవాళ ఎక్స్ వేదికగా పోస్టు చేసిన రాహుల్ గాంధీ.. బెంగాల్, అస్సాంలో ప్రజల తీర్పును అపహరించడం అనేది భారత ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసే క్రమంలో బీజేపీ వేసిన ఓ పెద్ద అడుగు అని ఇది కేవలం ఒక పార్టీ గెలుపోటములకు సంబంధించిన విషయం కాదన్నారు. దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన తరుణమని ఆయన పేర్కొన్నారు. చిన్నపాటి రాజకీయ ప్రయోజనాల కోసం దేశ భవిష్యత్తును పణంగా పెట్టవద్దన్నారు.
నెటిజన్ల రిక్షన్:
అయితే సొంత పార్టీ నేతలపై రాహుల్ గాంధీ చేసి వ్యాఖ్యలకు నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కొన్ని రోజుల క్రితమే మీరు బహిరంగంగా టీఎంసీని, మమతా బెనర్జీని విమర్శించారని టీఎంసీ వల్ల మీ సొంత పార్టీ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారని ఇప్పుడు అదే మమతాబెనర్జీ ఓటమినిపై ప్రజాస్వామ్యానికి సంబంధించిన విషయం అంటున్నారని ఇది మాట మార్చడం కాదా అని నిలదీస్తున్నారు.






