- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాకిస్థాన్‌లో రాహుల్‌గాంధీ ట్రెండింగ్.. కారణం ఇదే!
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ( India vs Pakistan ) మధ్య మొన్నటి వరకు యుద్ధం (War) జరిగిన సంగతి తెలిసిందే. అయితే అమెరికా (

దిశ, వెబ్ డెస్క్: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ( India vs Pakistan ) మధ్య మొన్నటి వరకు యుద్ధం (War) జరిగిన సంగతి తెలిసిందే. అయితే అమెరికా ( America) మధ్య వర్తిత్వం చేయడంతో ఈ యుద్ధం ఆగిపోయింది. అయినప్పటికీ పాకిస్తాన్ దొంగ దెబ్బ తీస్తూనే ఉంది. అటు ఇండియా కూడా సరైన సమాధానం చెబుతూ పాకిస్తాన్.. కు చుక్కలు చూపిస్తోంది.
అయితే ఇలాంటి ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ దేశంలో రాహుల్ గాంధీ ( Rahul Gandhi) పేరు ట్రెండింగ్ లోకి వచ్చింది. ప్రతిరోజు కాంగ్రెస్ ఆగ్రనేత రాహుల్ గాంధీ... పాకిస్తాన్ హెడ్ లైన్స్ లో నిలుస్తున్నారని తెలుస్తోంది. అలాగే ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) విషయంలో కూడా... మోడీ ( Modi) ప్రభుత్వాన్ని తరచూ ప్రశ్నిస్తున్నారు రాహుల్ గాంధీ. పాకిస్తాన్ దాడిలో రఫెల్ విమానాలు ఎన్ని నష్టపోయాయో... సమాధానం చెప్పాలని.. ఈ మధ్యకాలంలో రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తూనే ఉన్నారు.
అయితే మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ మాట్లాడుతున్న నేపథ్యంలో... దీన్ని పాకిస్తాన్ మీడియా, సోషల్ మీడియా వారియర్స్ ఆయుధంగా మార్చుకుంటున్నారు. రాహుల్ గాంధీకి సపోర్ట్ గా సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్నారు. దీంతో పాకిస్తాన్ లో రాహుల్ గాంధీ పేరు ట్రెండింగ్ లోకి వచ్చింది.






