- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
Kangana Ranaut: రాహుల్ గాంధీ అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి.. కంగనా తీవ్ర వ్యాఖ్యలు
దిశ, డైనమిక్ బ్యూరో: సెబీ చైర్ పర్సన్ మాధవి పురి బచ్ పై హిండెన్ బర్గ్ వెల్లడించిన నివేదిక దేశ రాజకీయాలను కుదిపేస్తోంది. ఈ అంశంలో అధికార ప్రతిపక్షాల మధ్య డైలాగ్ వార్ నడుస్తున్నది. ఈ క్రమంలో లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై బీజేపీ ఎంపీ, బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ అత్యంత ప్రమాదకరమైన, విషపూరిత, విధ్వంసకర వ్యక్తి అని ఆరోపించారు. ఆయన ప్రధాన మంత్రి కాకపోతే ఈ దేశాన్ని విఛ్ఛిన్నం చేయడమే ఆయన ఎజెండా అని ఆరోపించారు. ఎక్స్ ట్విట్టర్ లో సోమవారం ఓ పోస్ట్ చేసిన ఆమె.. హిండెన్ బర్గ్ రిపోర్ట్ ఆధారంగా స్టార్ మార్కెట్ గురించి రాహుల్ గాంధీ అసంతృప్తి కర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ దేశం యొక్క భద్రత, ఆర్థిక వ్యవస్థను అస్థిరపరిచేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు. రాహుల్ గాంధీ.. మీరు జీవితాంతం ప్రతిపక్షంలోనే కూర్చొడానికి సిద్ధంగా ఉండండి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజలు మిమ్మల్ని ఎన్నటికీ తమ నాయకుడిగా ఎంచుకోరు అని విమర్శించారు.