- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
10 మంది అగ్రనేతలు ఉండి ఏం లాభం.. సొంత నేతలపై రాహుల్ గాంధీ ఫైర్
సొంత నేతలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మధ్యప్రదేశ్(Madhya Pradesh)లోని భోపాల్‌లో పర్యటించారు.

దిశ, వెబ్‌డెస్క్: సొంత నేతలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మధ్యప్రదేశ్(Madhya Pradesh)లోని భోపాల్‌లో పర్యటించారు. ముఖ్య నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్(Congress)కు పదిమంది కీలక నేతలు ఉన్నారు.. అయినా పార్టీని అధికారంలోకి తీసుకురాలేక పోతున్నారు. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేయగలం అని డైలాగులు కొట్టడం కాదు.. పార్టీని పవర్‌లోకి తీసుకురాగలిగిన వారే ముఖ్య నాయకులు అని అన్నారు. కీలక నేతలు ఎవరూ నిర్లక్ష్యం చేయొద్దు.. ఈ పార్టీలో కొనసాగుతూ మరో పార్టీకి అనుకూలంగా పనిచేయొద్దు.. అలాంటి నేతలు ఉంటే.. నిర్భయంగా బయటకు వెళ్లొచ్చు. అలాంటి వారు మాకు అవసరం లేదు అని రాహుల్ గాంధీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పనిచేయడం లేదు కానీ.. సీఎం పదవి కోసం మాత్రం పదిమంది నేతలు పోటీ పడుతున్నారని సీరియస్ అయ్యారు. ఇక ఉపేక్షించేది లేదు.. పార్టీలో స్లీపర్ సెల్స్‌పై నిఘా పెట్టాం.. కనిపెట్టి కచ్చితంగా బయటకు పంపుతాం అని కీలక ప్రకటన చేశారు. క్షమశిక్షణ రాహిత్యాన్ని సహించేది లేదు అని అన్నారు. అంతకుముందు భోపాల్‌లోని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఇందిరా గాంధీకి రాహుల్ గాంధీ నివాళులు అర్పించారు.






