- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజీవ్ గాంధీ కంటే.. రాహుల్ గాంధీ చాలా మేధావి! శామ్ పిట్రోడా
కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ.. తన తండ్రి రాజీవ్ గాంధీ కంటే మేధావి, మంచి వ్యూహకర్త అని గాంధీ కుటుంబానికి ధీర్ఘకాల సలహాదారుగా ఉన్న శామ్ పిట్రోడా తెలిపారు.

దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ.. తన తండ్రి రాజీవ్ గాంధీ కంటే మేధావి, మంచి వ్యూహకర్త అని గాంధీ కుటుంబానికి ధీర్ఘకాల సలహాదారుగా ఉన్న శామ్ పిట్రోడా తెలిపారు. పీటీఐ(PTI) వార్తా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శామ్ మాట్లాడుతూ.. "లోక్ సభ ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీకి.. దేశ ప్రధాని(Prime Minister) అవ్వడానికి కావలసిన లక్షణాలు తనలో ఉన్నాయని అన్నారు. రాహుల్ గాంధీ తన విదేశీ పర్యటనలో భాగంగా.. దేశానికి చెడ్డ పేరు తెస్తున్నారన్న బీజేపీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని ఆయన అన్నారు. ఇంకా రాహుల్ అమెరికా పర్యటన గురించి మాట్లాడుతూ.. సెప్టెంబర్ 8-10 తేదీల్లో అమెరికా(America)లో రాహుల్ గాంధీ పర్యటన ఉంటుందని తెలిపారు. అమెరికాలో వ్యక్తిగత స్థాయిలో రాహుల్ పలువురిని కలవనున్నట్లు పిట్రోడా వెల్లడించారు. ఇంకా ఆమెరికాలో ఉన్నటువంటి జార్జ్ టౌన్ యూనివర్సిటీకి (Georgetown University), తదనంతరం ప్రెస్ క్లబ్ లో రాహుల్ గాంధీ మీడియా ప్రతినిధులతో సమావేశమవుతారు" అని పిట్రోడా తెలిపారు.
కాగా, తాను ఇప్పటివరకు చాలా మంది ప్రధానులతో సన్నిహితంగా పనిచేశానని, అందులో రాజీవ్ గాంధీ, పీవీ నరసింహారావు, వీపీ సింగ్, చంద్రశేఖర్, దేవెగౌడ, మన్మోహన్ లాంటి వారు కూడా ఉన్నారని అన్నారు. అయితే తాను ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలనని, అదేమిటంటే.. "రాజీవ్ గాంధీ కంటే రాహుల్ ఆలోచనాపరుడు, మేధావి అని, అయితే రాజీవ్ గాంధీ కి ఎక్కువసేపు పనిచేసే సామర్ధ్యం ఉందని అన్నారు. ఇప్పుడు రాహుల్ కూడా తన తండ్రి బాటలోనే మెరుగైన భారత్ ను ఏర్పాటు చేసేందుకు శ్రమిస్తున్నారు" అని పిట్రోడా వెల్లడించారు.






