- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాహుల్ గాంధీ బీజేపీకి బీ-టీమ్.. కేరళం సీఎం పినరయి కౌంటర్
రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ బీజేపీకి బీ-టీమ్‌లా వ్యవహరిస్తున్నాయని కేరళ సీఎం పినరయి విజయన్ విమర్శించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: అసెంబ్లీ ఎన్నికల వేళ కేరళంలో (Keralam) ప్రచార పర్వం హీటెక్కింది. అధికార పక్షం LDF, ప్రతిపక్ష UDF మధ్య మాటల యుద్ధం తీవ్రమైంది. తాజాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కేరళం సీఎం పినరయి విజయన్ (Pinarayi Vijayan) ఘాటు విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ బీజేపీకి బీ-టీమ్ అని ఆరోపించారు. తాజాగా ఓ న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ కేవలం మాటలకే పరిమితమవుతోందని, క్షేత్రస్థాయిలో బీజేపీని ఎదిరించడంలో విఫలమవుతోందని దుయ్యబట్టారు.
రాహుల్ వ్యాఖ్యలకు కౌంటర్:
రాహుల్ గాంధీ (Rahul Gandhi) కేరళకు వచ్చి లెఫ్ట్ (LDF) ప్రభుత్వాన్ని విమర్శించడంపై సీఎం మండిపడ్డారు. కేరళం ముఖ్యమంత్రి మినహా దేశంలోని ఇతర ప్రతిపక్ష నాయకులను కేంద్ర ఏజెన్సీలు అరెస్టు చేశాయని లేదా విచారణకు పిలిచాయని ఇటీవల రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మానేసి, బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్న తమ ప్రభుత్వంపై రాహుల్ విమర్శలు చేయడం వెనుక అంతర్యం ఏమిటని నిలదీశారు.
మీరు రాజీ పడుతున్నారు:
కాంగ్రెస్ నేతలు చాలామంది బీజేపీలోకి చేరుతున్నారని, ఆ పార్టీకి సిద్ధాంతపరమైన బలం లేదని విజయన్ విమర్శించారు. కేరళలో కూడా కాంగ్రెస్ మతతత్వ శక్తులతో రాజీ పడుతోందని ధ్వజమెత్తారు. శబరిమల బంగారం మాయంపై విజయన్ స్పందిస్తూ ఈ కేసు దర్యాప్తును కేరళం హైకోర్టు పర్యవేక్షిస్తోందని, విచారణలో హైకోర్టు ఎలాంటి తప్పు కనుగొనలేదని అన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఎంతో సహాయం చేసిందన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ వ్యాఖ్యలను ఆయన అసంబద్ధం అని కొట్టిపారేశారు.






