రాహుల్ గాంధీ NRI రాజకీయ నాయకుడు'.. ఎంపీ తేజస్వి సూర్య తీవ్ర విమర్శలు

by Malleboina Mahesh |

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తరచుగా విదేశీ పర్యటనలకు వెళ్లడంపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తీవ్ర విమర్శలు చేశారు.

రాహుల్ గాంధీ NRI రాజకీయ నాయకుడు.. ఎంపీ తేజస్వి సూర్య తీవ్ర విమర్శలు
X

దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తరచుగా విదేశీ పర్యటనలకు వెళ్లడంపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తీవ్ర విమర్శలు చేశారు. రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ ఆయన "నాన్-రెసిడెంట్ ఇండియన్ (NRI) రాజకీయ నాయకుడు" అని అభివర్ణించారు. "ఈ దేశం గురించి నిజంగా పట్టించుకునే, తమ బాధ్యతను సీరియస్‌గా తీసుకునే ఒక భారత నివాసి (India resident) ప్రతిపక్ష నాయకుడిని దేశం కోరుకుంటోంది. రాహుల్ గాంధీ భారతదేశంలో కంటే విదేశాల్లోనే ఎక్కువ కాలం ఉంటారు. ఆయన మనసు విదేశాల్లో ఉంది. కానీ అనివార్య కారణాల వల్ల ఇక్కడ రాజకీయం చేస్తున్నారు" అని తేజస్వి సూర్య విమర్శించారు.

పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలోనూ సెలవు తీసుకోవడం ఒక ఎంపీకి కూడా అసాధ్యమని, కానీ పార్లమెంట్ సమావేశాల మధ్యలో రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లడం ఆయన బాధ్యత పై ఉన్న శ్రద్ధను సూచిస్తుందని సూర్య పేర్కొన్నారు. "తదుపరిసారి కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి మరింత బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకుడిని ఎన్నుకుంటుందని ఆశిస్తున్నాను" అని ఈ సందర్భంగా ఎంపీ తేజస్వి సూర్య చెప్పుకొచ్చారు.

Next Story