- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Rahul gandhi: మోడీకి దమ్ముంటే ఆ పని చేయాలి.. రాహుల్ గాంధీ సవాల్
ఆపరేషన్ సిందూర్‌పై చర్చ సందర్భంగా లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

దిశ, నేషనల్ బ్యూరో: ఆపరేషన్ సిందూర్‌పై చర్చ సందర్భంగా లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. భారత్ పాక్ ఉద్రిక్తతలు, ఆపరేషన్ నిర్వహించిన తీరుపై ప్రశ్నలు సంధించారు. ఉగ్రస్థావరాలపై దాడికి ముందే పాక్‌కు సమాచారం ఇచ్చారని ఆరోపించారు. పాకిస్తాన్‌తో పోరాడటానికి ప్రభుత్వానికి రాజకీయ సంకల్పం లేదని తెలిపారు. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే చేసిన వాదనలను బహిరంగంగా తిరస్కరించాలని, ఆయనను అబద్ధాలకోరు అని పిలవాలని ప్రధాని మోడీకి సవాల్ విసిరారు. ‘యుద్ధాన్ని ఆపానని ట్రంప్ 29 సార్లు చెప్పారు. ఇందిరా గాంధీ ధైర్యంలో 50 శాతం ప్రధానికి ఉన్నా ఆయన పార్లమెంటులో లేచి నిలబడి ట్రంప్ అబద్ధం చెబుతున్నాడు. ఆయన ఎప్పుడూ కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించలేదు’ అని చెప్పాలని డిమాండ్ చేశారు. ట్రంపును మోడీ ఏనాడూ విమర్శించలేదని తేల్చి చెప్పారు.
కేంద్రానికి అండగా నిలబడ్డాం
రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యలపై రాహుల్ స్పందిస్తూ.. ఆపరేషన్ సిందూర్‌ను 1971లో జరిగిన యుద్ధంతో పోల్చడం పొరపాటు అని అన్నారు. ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైన క్షణం నుంచి ప్రతిపక్షం సహా అన్ని పార్టీలు భారత సైన్యం, కేంద్రం ప్రభుత్వానికి అండగా నిలబడ్డామని తెలిపారు. ప్రభుత్వంలోని కొంతమంది నాయకులు వ్యంగ్యాంగా వ్యాఖ్యానించినా వాటిని పట్టించుకోలేదన్నారు. ఘర్షణ టైంలో ఐక్యతను ప్రదర్శించడం ఎంతో గర్వంగా ఉందన్నారు. ‘ఆపరేషన్ సిందూర్ తెల్లవారుజామున 1.05 గంటలకు ప్రారంభమై, 22 నిమిషాల పాటు కొనసాగిందని రాజ్ నాథ్ సింగ్ చెప్పారు. అలాగే ఆయన ఓ షాకింగ్ విషయం సైతం చెప్పారు. 1.35 గంటలకు మేము పాక్‌కు ఫోన్ చేసి సైనికేతర లక్ష్యాలను ఢీకొట్టామని, సైనిక లక్ష్యాలను ఢీకొట్టబోమని చెప్పామన్నారు. అంటే పోరాడటానికి రాజకీయ సంకల్పం లేదని పాక్ కు స్పష్టం చేశారు’ అని వ్యాఖ్యానించారు.
ప్రతిష్టను కాపాడుకోవడానికే మోడీ ఆరాటం
పహెల్గాం ఉగ్రదాడి తర్వాత తన ప్రతిష్టను కాపాడుకోవడానికే ప్రధాని మోడీ సాయుధ దళాలను ఉపయోగిస్తున్నారని ఫైర్ అయ్యారు. డీజీఎంఓ స్థాయి చర్చలు జరుగుతున్నప్పుడు, పాకిస్తాన్ చైనా నుంచి ప్రత్యక్ష డేటాను పొందుతున్నట్లు వెలుగులోకి వచ్చిందని, ఈ టైంలో ప్రధాని తన ప్రతిష్టను కాపాడుకోవడానికి సైన్యాన్ని ఉపయోగించడం ప్రారంభించారని ఆరోపించారు. సైన్యాన్ని ఉపయోగించాల్సిన విధంగా వాడుకునే ధైర్యం లేని ప్రధానమంత్రిని మనం భరించలేమన్నారు. ఈ ఆపరేషన్ మొత్తానికి సూత్రధారి అయిన పాక్ ఆర్మీ చీఫ్ ట్రంప్ తో విందు చేశారని గుర్తు చేశారు. దీనిపై కూడా మోడీ ఏం మాట్లాడలేదన్నారు.






