- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Rahul Gandhi: పేదలను దోచుకునేందుకే జీఎస్టీ.. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ
దిశ, నేషనల్ బ్యూరో: బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీ, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్ర విమర్శలు గుప్పించారు. బీజేపీ రూపొందించిన పన్నుల విధానం పేదలను దోచుకునేందుకునేనని ఆరోపించారు. జార్ఖండ్(Jharkhand)లోని ధన్‌బాద్(Dhanbad)లో శనివారం జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన ప్రసంగించారు. ఆదానీ(Adhanee) పేద ప్రజలతో సమానంగా పన్నులు చెల్లిస్తున్నారని, కానీ రూ.లక్షల కోట్ల విలువైన ధారావి భూములను మాత్రం ఆయనకే ధారాదత్తం చేస్తున్నారని తెలిపారు. ‘ప్రధాని మోడీ(Pm modi) సీప్లేన్‌లో ప్రయాణిస్తారు. సముద్రంలోకి వెళ్తారు. ధరల పెరుగుదలను మాత్రం పేదలు, మహిళలు భరిస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు.
భారత జనాభాలో ఎస్టీ(Sc), ఎస్సీ(St), ఓబీసీ(Obc)లు 90శాతం ఉన్నారని కానీ వారికి ప్రభుత్వ సంస్థల్లో ప్రాతినిధ్యం లేదని ఆరోపించారు. ‘దేశంలో యువత, మహిళలు సంతోషంగా లేరన్నది వాస్తవం. ప్రధాని మోడీ పెద్ద పెద్ద ప్రసంగాలు మాత్రమే చేస్తారు. కానీ అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి పనికి వచ్చే పనులు ఏమీ చేయరు. దేశంలో ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు తల్లులు, సోదరీమణులే ఎక్కువగా నష్టపోతారు. మోడీ ప్రతిదానిపై వస్తు సేవల పన్ను (GST) విధించారు. ఈ పన్ను నిర్మాణం దేశంలోని పేద ప్రజల నుంచి దోచుకునేందుకే’ అని విమర్శించారు. మోడీ అంబానీల పెళ్లిళ్లకు మాత్రమే వెళ్తారని, ఏ పేదవాడి పెళ్లికీ వెళ్లబోరని ఎద్దేవా చేశారు. కులగణనను మోడీ ఆపలేరని స్పష్టం చేశారు.