- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Rahul Gandhi: రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi)కి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఎన్నికల ర్యాలీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాపై రాహుల్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ గతంలో పరువునష్టం కేసు దాఖలైంది.

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi)కి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఎన్నికల ర్యాలీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాపై రాహుల్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ గతంలో పరువునష్టం కేసు దాఖలైంది. ఈ కేసులో ట్రయల్ కోర్టు విచారణపైనే సుప్రీంకోర్టు స్టే విధించింది. న్యాయమూర్తులు జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం జార్ఖండ్ ప్రభుత్వానికి, పిటిషనర్ బీజేపీ కార్యకర్త నవీన్ ఝాకు కూడా నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా తమ సమాధానాలను సమర్పించాలని కోరారు. ఆరు వారాల తర్వాత ఈ కేసుపై సుప్రీంకోర్టులో తదుపరి విచారణ జరగనుంది.
జార్ఖండ్ కోర్టులో విచారణ..
రాహుల్ గాంధీ తరపున వాదించిన సీనియర్ న్యాయవాది డాక్టర్ అభిషేక్ మను సింఘ్వి పిటిషనర్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. బాధిత వ్యక్తి మాత్రమే క్రిమినల్ పరువు నష్టం దావా వేయవచ్చని చెప్పిన గత తీర్పులను ఉదహరించారు. ఈ కేసుని కొట్టివేయాలని సూచించారు. థార్డ్ పార్టీ ఫిర్యాదు దాఖలు చేయవద్దని చెప్పుకొచ్చారు. ఇకపోతే, ఈ కేసు జార్ఖండ్‌లోని చైబాసాలోని ప్రజాప్రతినిధుల కోర్టులో ఉంది. గత సంవత్సరం ఫిబ్రవరిలో రాహుల్ గాంధీపై దిగువ కోర్టు నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అప్పట్లో ఈ కేసును కొట్టివేయాలని గాంధీ జార్ఖండ్ హైకోర్టును కోరారు. కానీ, కోర్టు జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. విచారణకు భౌతికంగా హాజరుకావాలని సూచించింది. మినహాయింపు కోసం ఆయన చేసిన అభ్యర్థనను తిరస్కరించారు.






