సొమ్మసిల్లి పడిపోయిన మహువ మోయిత్రా.. సపర్యలు చేసిన రాహుల్ గాంధీ

by Muthe.Rajitha |   (  Updated:2025-08-11 13:29:18  IST  )

దేశ రాజధానిలో ఇండియా కూటమి అభ్యర్థుల నిరసన ర్యాలీ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసిన సంగతి తెలిసిందే.

సొమ్మసిల్లి పడిపోయిన మహువ మోయిత్రా.. సపర్యలు చేసిన రాహుల్ గాంధీ
X

దిశ, వెబ్ డెస్క్ : దేశ రాజధానిలో ఇండియా కూటమి అభ్యర్థుల నిరసన ర్యాలీ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసిన సంగతి తెలిసిందే. బీహార్లో ఓటర్ల ప్రత్యేక సవరణపై వ్యతిరేకిస్తూ పార్లమెంటు నుంచి ప్రధాన ఎన్నికల కేంద్ర కార్యాలయం వరకు రాహుల్ గాంధీ నేతృత్వంలో ఇండియా కూటమి చేపట్టిన ధర్నాను పోలీసులు అడ్డుకోవడంతో కాసేపు ఢిల్లీ వీధుల్లో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులు ఆ ర్యాలీని అడ్డుకొని కూటమి నేతలను అదుపులోకి తీసుకున్నారు. అయితే వారందరినీ బలవంతంగా వాహనంలోకి ఎక్కించే క్రమంలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా సొమ్మసిల్లి పడిపోయింది. దీంతో కంగారు పడిన నేతలంతా తనకు సపర్యలు చేసారు. రాహుల్ గాంధీ మహువాకు గాలి విసురుతూ మంచినీళ్లు తాగించారు. గాలి ఆడేలా కిటికీ పక్కన కూర్చోబెట్టి గాలి విసిరారు. దీంతో కాసేపటికి తేరుకున్న మహువాను చూసి వారంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

Next Story