- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఒక దేశాధినేత హత్యను మీరు సమర్థిస్తారా ? : ప్రధానికి రాహుల్ సూటి ప్రశ్న
ఖమేనీ హత్యపై ప్రధాని మోదీ మౌనం వీడాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా, ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య పెరుగుతున్న యుద్ధ మేఘాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంక్షోభంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనుసరిస్తున్న మౌనాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో ఒక పోస్ట్ చేశారు. అంతర్జాతీయ వేదికపై భారత్ తన నైతిక స్పష్టతను చాటుకోవాల్సిన సమయం వచ్చిందని రాహుల్ గాంధీ ఆ పోస్టులో పేర్కొన్నారు.
మధ్యప్రాచ్యంలో నెలకొన్న అస్థిరత వల్ల కోట్లాది మంది ప్రజలతో పాటు, అక్కడ నివసిస్తున్న సుమారు కోటి మంది భారతీయుల భవిష్యత్తు అనిశ్చితిలో పడిందని రాహుల్ ఎక్స్ వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాన్‌పై జరుగుతున్న ఏకపక్ష దాడులను, అలాగే ఇతర దేశాలపై ఇరాన్ జరుపుతున్న దాడులను కూడా భారత ప్రభుత్వం ఖండించాలని డిమాండ్ చేశారు. సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించే దాడులు సంక్షోభాన్ని మరింత పెంచుతాయని హెచ్చరించారు. "హింస హింసకే దారితీస్తుంది" అని పేర్కొంటూ.. కేవలం చర్చలు, సంయమనం ద్వారానే శాంతి సాధ్యమవుతుందని ఆయన స్పష్టం చేశారు.
ప్రధానిపై సూటి ప్రశ్నలు
భారత విదేశాంగ విధానం ఎప్పుడూ సార్వభౌమాధికారం, శాంతియుత పరిష్కారాలపైనే ఆధారపడి ఉంటుందని గుర్తు చేస్తూ రాహుల్ గాంధీ ప్రధానిని నిలదీశారు. ఒక దేశాధినేతను హత్య చేయడం ద్వారా ప్రపంచ క్రమాన్ని నిర్ణయించడాన్ని ప్రధానిగా మీరు సమర్థిస్తారా? అని మోదీని సూటిగా ప్రశ్నించారు. ఈ సమయంలో ప్రధాని మౌనం ప్రపంచ దేశాల ముందు భారత ప్రతిష్టను తగ్గిస్తుందని ఆ పోస్టులో పేర్కొన్నారు.
అంతర్జాతీయ చట్టాలను, మానవ ప్రాణాలను కాపాడటం కోసం భారత్ ముక్కుసూటిగా మాట్లాడే ధైర్యం చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా సయ్యద్ అలీ ఖమేనీ మరణంపై కేంద్రం స్పందించాలన్నారు. మోదీ సర్కార్ సైలెంట్ గా ఉండటం వల్ల ప్రపంచవేదికపై భారత్ కు ఉన్న గౌరవం తగ్గిపోతుందని అభిప్రాయపడ్డారు.






