‘కలలో కూడా ఆ కుట్రలు సాగనివ్వం’.. RSS నేతకు రాహుల్ గాంధీ స్ట్రాంగ్ కౌంటర్

by Gantepaka Srikanth |

ఆర్ఎస్ఎస్(RSS) నేత దత్తాత్రేయ వ్యాఖ్యలకు రాహుల్ గాంధీ(Rahul Gandhi) కౌంటర్ ఇచ్చారు.

‘కలలో కూడా ఆ కుట్రలు సాగనివ్వం’.. RSS నేతకు రాహుల్ గాంధీ స్ట్రాంగ్ కౌంటర్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆర్ఎస్ఎస్(RSS) నేత దత్తాత్రేయ వ్యాఖ్యలకు రాహుల్ గాంధీ(Rahul Gandhi) కౌంటర్ ఇచ్చారు. శుక్రవారం రాహుల్ మీడియాతో మాట్లాడుతూ.. ఆర్ఎస్ఎస్, బీజేపీ(BJP) కుట్ర బయటపడిందని అన్నారు. ఆర్ఎస్ఎస్ ముసుగు తొలగిపోయిందని చెప్పారు. రాజ్యాంగాన్ని రద్దుచేసే దేశంలో మనుస్మృతిని అమలు చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. కలలో కూడా ఆర్ఎస్ఎస్, బీజేపీ కుట్రలను సాగనివ్వమని రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు.

కాగా, రాజ్యాంగ పీఠిక నుంచి ‘సోషలిస్ట్, సెక్యులర్’ పదాలను తొలగించాలని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబాలే డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీలోని ఓ కార్యక్రమంలో ప్రసంగించిన దత్తాత్రేయ.. అత్యవసర పరిస్థితి సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశికలో చేర్చిన సోషలిస్ట్, లౌకిక పదాలు అలాగే ఉండాలా వద్దా అని పరిశీలించాలని వాదించారు. అత్యవసర పరిస్థితి విధించినందుకు కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమర్జెన్సీ విధించిన వారు రాజ్యాంగ కాపీలు పట్టుకుని తిరుగుతున్నారని కాంగ్రెస్ నేతల్ని విమర్శించారు. తాజాగా దత్తాత్రేయ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు.

Next Story