అది నాకూ వర్తిస్తుంది.. పెళ్లిపై రాహుల్ గాంధీ ఫన్నీ కామెంట్స్

by Ajay Maddhiboyina |   (  Updated:2025-08-24 17:05:13  IST  )

అది నాకు కూడా వ‌ర్తిస్తుంది అంటూ పెళ్లిపై కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఈ విషయంలో ఆర్జేడీ అధ్య‌క్షుడు లాలూ ప్ర‌సాద్ యాదవ్‌తో మాట మంతీ కొనసాగుతోందని అన్నారు.

అది నాకూ వర్తిస్తుంది.. పెళ్లిపై రాహుల్ గాంధీ ఫన్నీ కామెంట్స్
X

దిశ‌, వెబ్ డెస్క్: అది నాకు కూడా వ‌ర్తిస్తుంది అంటూ పెళ్లిపై కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఈ విషయంలో ఆర్జేడీ అధ్య‌క్షుడు లాలూ ప్ర‌సాద్ యాదవ్‌తో మాట మంతీ కొనసాగుతోందని అన్నారు. ఓ కార్యక్రమంలో తేజస్వీయాదవ్ మాట్లాడుతూ.. కేంద్రమంత్రి, ఎల్‌జేపీ నేత చిరాగ్ పాసవాన్ ఇక పెళ్లి చేసుకోవాలని సూచించారు. దీంతో పక్కనే కూర్చున్న రాహుల్ గాంధీ వెంటనే మైక్ తీసుకుని ఈ సూచన నాకు కూడా వర్తిస్తుందని వ్యాఖ్యానించారు.

తరవాత ఇదే విషయం మా నాన్న లాలూ ప్రసాద్ యాదవ్ ఎప్పటి నుండో చెబుతున్నారు కదా అని తేజస్వీ యాదవ్ సమాధానం ఇచ్చారు. దీంతో అక్కడ కాసేపు సరదాగా నవ్వుకున్నారు. మరోవైపు పాట్నాలో ఓ కార్యక్రమంలో లాలూ ప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ .. మా మాట విను పెళ్లి చేసుకో, మేమంతా నీ బరాత్‌కు రావాలనుకుంటున్నాం. వివాహానికి విముఖత చూపడంతో మీ తల్లి ఆందోళన చెందుతుంది. అంటూ వ్యాఖ్యానించారు. దీంతో అక్కడ ఉన్నవారంతా నవ్వారు. ఇప్పుడు రాహుల్ గాంధీనే తన పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చి సరదా కామెంట్లు చేశారు.

Next Story