ఈసీపై మరోసారి విరుచుకుపడ్డ రాహుల్.. సమాధానం చెప్పాలని 5 ప్రశ్నలు

by Gantepaka Srikanth |   (  Updated:2025-08-08 11:27:56  IST  )

కేంద్ర ఎన్నికల సంఘం(Election Commission)పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈసీపై మరోసారి విరుచుకుపడ్డ రాహుల్.. సమాధానం చెప్పాలని 5 ప్రశ్నలు
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ఎన్నికల సంఘం(Election Commission)పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు శుక్రవారం సోషల్ మీడియా వేదికగా ఆయన ట్వీట్ పెట్టారు. ఎన్నికల సంఘానికి 5 ప్రశ్నలు సంధించారు. డిజిటల్‌ ఓటర్‌ జాబితా ఎందుకు ఇవ్వడం లేదు?, సీసీటీవీ ఆధారాలు ఎందుకు నాశనమయ్యాయి?, నకిలీ ఓటర్ల జాబితా ఎందుకు తారుమారైంది?, ప్రతిపక్ష నేతలను ఎందుకు బెదిరిస్తున్నారు?, BJPకి ఎన్నికల సంఘం ఏజెంట్‌గా మారిందా? చెప్పాలని రాహుల్‌ గాంధీ ప్రశ్నించారు. కాగా, ఇంతకుముందే.. బీజేపీ(BJP)కి అనుకూలంగా ఈసీ వ్యవహరిస్తోందని, అనేక రాష్ట్రాల ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని రాహుల్ ఆరోపించారు. ఈ క్రమంలో బిహార్ ఓటర్ల జాబితా సవరణపై విరుచుకుపడ్డారు. వేలల్లో నకిలీ ఓటర్లు ఉన్నారని, ఒకే ఇంటిలో 80 మంది ఓటర్లు ఉన్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఏకంగా మీడియా సమావేశంలో ప్రజంటేషన్ సైతం ఇచ్చారు. హర్యానా, మధ్యప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల్లో అంచనాలకు భిన్నంగా ఫలితాలు వచ్చాయని, మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై కూడా అనుమానాలు ఉన్నాయని అన్నారు.

Next Story