Rahul Gandhi: ఆ ఓట్లన్ని బీజేపీ ఖాతాలోకి వెళ్లాయి.. రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు

by Shiva |
Rahul Gandhi: ఆ ఓట్లన్ని బీజేపీ ఖాతాలోకి వెళ్లాయి.. రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు
X

దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్ర (Maharashtra) ఓటర్ల జాబితాలో భారీగా అవకతవకలు జరగాయని ఏఐసీసీ (AICC) అగ్రనేత, లోక్‌సభ పక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన ఢిల్లీ (Delhi)లో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉన్న జనాభా కంటే ఓటర్లు ఎక్కువగా ఎలా ఉంటారని ప్రశ్నించారు. కామ్తీ అసెంబ్లీ సెగ్మెంట్‌ (Kamti Assembly Segment)లోనే.. ఐదేళ్లలో 35 లక్షల మంది కొత్త ఓటర్లు చేరారని అన్నారు. ఆ ఓటర్లు సంఖ్య హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) ఓటర్ల సంఖ్యకు సమానమని కామెంట్ చేశారు. ఆ 35 లక్షల ఓట్లు మొత్తం బీజేపీ (BJP) ఖాతాలోకే వెళ్లాయని ఆరోపించారు. ఈ ఒక్క నియోజకవర్గంలోనే కాదు.. చాలా నియోజకవర్గాల్లో ఇలాంటి పరిస్థితులే ఉన్నాయని పేర్కొన్నారు. ఓటరు జాబితాలో తప్పులు జరిగాయి కాబట్టే కేంద్ర ఎన్నికల కమిషన్ (Central Election Commission) జవాబు చెప్పలేక మోహం చాటేసిందని రాహుల్ గాంధీ ఆరోపణలు గుప్పించారు. ఆ ఓట్లన్ని బీజేపీ ఖాతాలోకి వెళ్లాయి.. రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు

Advertisement
Next Story