ఇంగ్లీష్‌పై అమిత్‌ షా వ్యాఖ్యలకు రాహుల్‌ కౌంటర్.. మరో కొత్త కుట్రకు తెరలేపారని ఆరోపణ

by Gantepaka Srikanth |

ఇంగ్లీష్‌ భాష(English Language)పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) చేసిన వ్యాఖ్యలకు రాహుల్ గాంధీ(Rahul Gandhi) కౌంటర్ ఇచ్చారు.

ఇంగ్లీష్‌పై అమిత్‌ షా వ్యాఖ్యలకు రాహుల్‌ కౌంటర్.. మరో కొత్త కుట్రకు తెరలేపారని ఆరోపణ
X

దిశ, వెబ్‌డెస్క్: ఇంగ్లీష్‌ భాష(English Language)పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) చేసిన వ్యాఖ్యలకు రాహుల్ గాంధీ(Rahul Gandhi) కౌంటర్ ఇచ్చారు. శుక్రవారం రాహుల్ మీడియాతో మాట్లాడుతూ.. ఇంగ్లీష్‌తోనే అభివృద్ధి సాధ్యమని రాహుల్ అన్నారు. RSS, బీజేపీ నేతల పిల్లలు విదేశాల్లో చదువుతున్నారు.. మరి దాని సంగతేంటి? అని ప్రశ్నించారు. ఇదంతా పేద పిల్లలకు ఉన్నత విద్యను దూరంచేసే కుట్ర మాత్రమే అని సీరియస్ అయ్యారు. మాతృభాషతో పాటు ఇంగ్లీష్‌ చాలా అవసరమని రాహుల్‌ గాంధీ స్పష్టం చేశారు.

కాగా, నిన్న అమిత్ షా మాట్లాడుతూ.. ఇంగ్లీషులో మాట్లాడేవారు సిగ్గుపడే రోజులు వస్తాయని, అలాంటి సమాజం ఏర్పడే రోజులు ఎంతో దూరంలో లేవన్నారు. మన దేశ భాషలే మన సంస్కృతికి రత్నాలని పేర్కొన్న ఆయన.. అవి మనుగడలో లేకుంటే నిజమైన భారతీయులుగా ఉండలేమని వ్యాఖ్యానించారు. మాజీ ఐఏఎస్‌ అశుతోష్‌ అగ్నిహోత్రి రాసిన ఓ పుస్తకాన్ని ఆవిష్కరించిన సందర్భంగా అమిత్‌ షా ఈ విధంగా మాట్లాడారు.

Next Story