- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సైనిక్ స్కూల్లో ర్యాగింగ్.. వీడియో వైరల్
గుజరాత్ లోని ఓ సైనిక్ స్కూల్లో ర్యాగింగ్ ఘటన సంచలనం రేపుతోంది.

దిశ, వెబ్ డెస్క్ : గుజరాత్ లోని ఓ సైనిక్ స్కూల్లో ర్యాగింగ్ ఘటన సంచలనం రేపుతోంది. స్కూల్లో సీనియర్లు జూనియర్లపై ర్యాగింగ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విషయం కేంద్రమంత్రి వరకు వెళ్లడంతో అధికారులు చర్యలకు దిగారు. గుజరాత్‌లోని బాలచాడి సైనిక స్కూల్‌లో సీనియర్ అబ్బాయిలు వారి జూనియర్లను టవల్స్ మీద నిలబెట్టి హింసించారు.
పలువురిని అర్థనగ్నంగా నిలబెట్టి కర్రతో బాదటంతో వారు నొప్పితో ఆర్తనాదాలు చేస్తున్న వీడియో బయటికి వచ్చింది. ఈ వ్యవహారంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడమే కాకుండా... కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేసారు. అయితే ఈ స్కూలు కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో పని చేస్తుండటంతో.. కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేసారు. దీంతో ర్యాగింగ్ కు పాల్పడిన విద్యార్థులను సస్పెండ్ చేసారు అధికారులు.
కాగా మరోవైపు అరుణాచల్ లోకి ఓ సైనిక్ స్కూల్లో సీనియర్ విద్యార్థులు దొంగతనం మోపడంతో ఓ విద్యార్ధి సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న ఘటన కూడా దుమారం రేపుతోంది. క్రమశిక్షణకు మారుపేరైన సైనిక్ స్కూళ్లలో కూడా ఇలాంటి దారుణాలు జరగడం పట్ల పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.






