- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Rafale jet: రఫేల్ ప్రమాదంపై పాక్‌కు షాక్.. డసాల్ట్ సీఈఓ కీలక వ్యాఖ్యలు
ఆపరేషన్ సిందూర్ ప్రారంభమైనప్పటి నుంచి రఫేల్ భారత్ తన రఫేల్ జెట్ కోల్పోయిందని కథనాలు వెలువడుతున్న విషయం తెలిసిందే.

దిశ, నేషనల్ బ్యూరో: ఆపరేషన్ సిందూర్ (Operation sindhoor) ప్రారంభమైనప్పటి నుంచి భారత్ తన రఫేల్ జెట్ (Rafale jet) కోల్పోయిందని కథనాలు వెలువడుతున్న విషయం తెలిసిందే. తాజాగా దీనిపై డసాల్ట్ ఏవియేషన్ చైర్మన్, సీఈఓ ఎరిక్ ట్రాపియర్ ( Eric Trappier) క్లారిటీ ఇచ్చారు. అధిక ఎత్తులో ఉన్నప్పుడు సాంకేతిక కారణాల వల్ల విమానం కోల్పోయిందని స్పష్టం చేశారు. అయితే పాక్ దాడుల వల్ల ప్లైట్ కూలిపోలేదని తెలిపారు. మూడు రఫేల్ జెట్లు కూలిపోయినట్టు పాక్ చేసిన వాదన సరికాదని, దానికి ఎటువంటి ఆధారాలూ లేవన్నారు. అధిక ఎత్తులో సాంకేతిక వైఫల్యం కారణంగా రఫేల్ జెట్‌కి నష్టం జరిగిందని వెల్లడించారు. శిక్షణ సమయంలో 12,000 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో రఫేల్ ఉందని అందుకే ప్రమాదం జరిగిందని తెలిపారు. ఆ సమయంలో ఒక్క శత్రు రాడార్ కూడా యాక్టివ్‌గా లేదని తేల్చి చెప్పారు.
కాగా, భారత్-పాకిస్తాన్ సైనిక ఘర్షణలో, జే-10C మల్టీ-రోల్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ ద్వారా ప్రయోగించబడిన పీఎల్-15E లాంగ్-రేంజ్ క్షిపణులను ఉపయోగించి మూడు రఫేల్‌లతో సహా ఐదు భారత వైమానిక దళ యుద్ధ విమానాలను కూల్చివేసినట్లు పాకిస్తాన్ వైమానిక దళం (PAF) ఇటీవల పేర్కొంది. ఎటువంటి ఆధారాలు లేకుండానే ఈ ఆరోపణలు చేసింది. ఈ క్రమంలోనే ట్రాపియర్ క్లారిటీ ఇచ్చారు.






