- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Radhika: రాధికను అందుకే చంపేశా.. టెన్నిస్ ప్లేయర్ తండ్రి షాకింగ్ కామెంట్
హర్యానాలోని గురుగ్రామ్‌లో టెన్నిస్ ప్లేయర్ రాధిక యాదవ్ ను ఆమె తండ్రి కాల్చి చంపిన విషయం తెలిసిందే.

దిశ, నేషనల్ బ్యూరో: హర్యానాలోని గురుగ్రామ్‌లో టెన్నిస్ ప్లేయర్ రాధిక యాదవ్ (Radhik Yadav) ను ఆమె తండ్రి కాల్చి చంపిన విషయం తెలిసిందే. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు రాధిక తండ్రి దీపక్ యాదవ్‌ను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే ఆయన పోలీసులకు కీలక విషయాలు వెల్లడించారు. తన కుమార్తె టెన్నిస్ అకాడమీ నుంచి వచ్చే సంపాదనతో తాను తింటున్నానని ప్రజలు నన్ను ఎగతాళి చేసేవారని తెలిపారు. రాధిక నిర్వహిస్తు్న్న అకాడమీని మూసివేయాలని కుమార్తెను కోరానని, ఆమె అంగీకరించకపోవడంతోనే కోపంతో కాల్చి చంపానని వెల్లడించారు. అద్దె ఇళ్ల ద్వారా వచ్చే ఆదాయం కారణంగా దీపక్ తాను ఆర్థికంగా సురక్షితమని భావించాడని, రాధిక సొంతంగా అకాడమీ నిర్వహించాల్సిన అవసరం లేదని నమ్మాడని పోలీసులు తెలిపారు. రాధిక నిర్వహిస్తున్న టెన్నిస్ అకాడమీ వారి మధ్య ఘర్షణకు ప్రధాన కారణమని భావిస్తున్నారు. మరోవైపు రాధిక యాదవ్ పై నాలుగు బుల్లెట్ గాయాలున్నాయని పోస్ట్ మార్టం రిపోర్టులో వెల్లడైంది.






