సంచలనంగా మారుతున్న రేబిస్ వ్యాధి

by Malleboina Mahesh |

రేబిస్ వ్యాధి ప్రపంచానికి పెద్ద ముప్పుగా మారుతుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. దీనికి తాజాగా వెలువడుతున్న గణాంకాలు మరింత బలం చేకూరుస్తున్నాయి.

సంచలనంగా మారుతున్న రేబిస్ వ్యాధి
X

దిశ, వెబ్‌డెస్క్: రేబిస్ వ్యాధి (Rabies disease) ప్రపంచానికి పెద్ద ముప్పుగా మారుతుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. దీనికి తాజాగా వెలువడుతున్న గణాంకాలు మరింత బలం చేకూరుస్తున్నాయి. డబ్ల్యూహెచ్‌వో (WHO) తాజా హెచ్చరిక ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ప్రతి 9 నిమిషాలకు ఒకరు రేబిస్‌తో మృతి చెందుతున్నారు. ఈ భయానక మరణాల్లో మూడో వంతు భారతదేశంలోనే చోటు చేసుకోవడం తీవ్రమైన ఆందోళన కలిగిస్తోంది. 2023లోనే దేశవ్యాప్తంగా 284 మంది రేబిస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారని, కోట్ల సంఖ్యలో వీధి కుక్కలు తిరుగుతున్నదే ఈ దుస్థితికి కారణమని ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ (IDSP) పార్లమెంట్‌కు నివేదిక అందించింది.

ప్రపంచంలోని పలు దేశాలు కుక్కలకు కనీసం 70% వాక్సినేషన్‌ సాధించి రేబిస్ నియంత్రణ (Rabies control)లో విజయవంతమయ్యాయి. అయితే భారతదేశం ఇంకా ఈ విషయంలో వెనుకబడినట్టే కనిపిస్తోంది. ప్రజల ప్రాణాలను కాపాడాలంటే తక్షణమే వ్యాక్సినేషన్ కార్యక్రమాలు వేగవంతం చేయడం, వీధి కుక్కల నియంత్రణ, అవగాహన సదస్సులు నిర్వహించడం అత్యవసరం అని డబ్ల్యూహెచ్‌వో స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం (Central Govt) కూడా త్వరలో ఈ ప్రక్రియను అమలు చేస్తుందని ప్రకటించినా, ప్రస్తుత పరిస్థితి తక్షణ చర్యలు తీసుకోకపోతే మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Next Story