- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Quad: చైనా ఆధిపత్యానికి చెక్.. క్వాడ్ దేశాల కీలక నిర్ణయం
మినరల్ సెక్టార్‌లో చైనా ఆధిపత్యాన్ని తగ్గించడానికి ‘క్వాడ్’ దేశాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి.

దిశ, నేషనల్ బ్యూరో: మినరల్ సెక్టార్‌లో చైనా ఆధిపత్యాన్ని తగ్గించడానికి ‘క్వాడ్’ (Quad) దేశాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ‘క్వాడ్ క్రిటికల్ మినరల్స్ ఇనిషియేటివ్’ను ప్రారంభించాయి. దీని ప్రకారం.. ఖనిజాల సరఫరాను సులభతరం చేయడానికి క్వాడ్ దేశాలు కలిసి పనిచేస్తాయి. అంతేగాక అవసరమైన ఖనిజాల కొరతను నివారించడానికి, వాటి సరఫరా కోసం ఇతరులపై ఎక్కువగా ఆధారపడకుండా ఉండటానికి కలిసి పనిచేయనున్నాయి. అమెరికాలోని వాషింగ్టన్‌లో సమావేశమైన క్వాడ్ దేశాల విదేశాంగ మంత్రులు ఈ మేరకు సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేశారు. ‘క్రిటికల్ మినరల్స్ ప్రాసెసింగ్, రిఫైనింగ్ వంటి రంగాల్లో ఒక దేశంపై ఆధారపడటం ఆర్థిక, జాతీయ భద్రతకు ముప్పు. అందుకే గ్లోబల్ సప్లై చైన్‌లను విస్తరించడం, విశ్వసనీయంగా ఉంచడం కీలకం. కాబట్టి క్రిటికల్ మినరల్స్ సరఫరాను విస్తరించడానికి భాగస్వామ్యాన్ని పెంచుతూ క్వాడ్ క్రిటికల్ మినరల్స్ ఇనిషియేటివ్‌ను ప్రారంభిస్తున్నాం’ అని పేర్కొన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా కీలక ఖనిజాల సరఫరా, ప్రాసెసింగ్ రంగంలో చైనా ఆధిపత్యం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిని క్వాడ్ దేశాల విదేశాంగ మంత్రులు తీవ్రంగా ఖండించారు. ఈ దాడికి పాల్పడిన నిందితులపై వీలైనంత త్వరగా కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. కాగా, క్వాడ్‌లో భారత్ (India), అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా ఉన్నాయి. ఈ దేశాల విదేశాంగ మంత్రులు అమెరికాలో సమావేశమయ్యారు.






