Qatar : ఉగ్రపోరులో భారత్ వైపు నిలిచిన ఖతార్

by Muthe.Rajitha |

గత ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాం సమీపంలోని బైసరన్ వ్యాలీలో జరిగిన ఉగ్రదాడి(Pahalgam Terror Attack)లో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు గాయపడిన విషయం తెలిసిందే.

Qatar : ఉగ్రపోరులో భారత్ వైపు నిలిచిన ఖతార్
X

దిశ, వెబ్ డెస్క్ : గత ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాం సమీపంలోని బైసరన్ వ్యాలీలో జరిగిన ఉగ్రదాడి(Pahalgam Terror Attack)లో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు గాయపడిన విషయం తెలిసిందే. ఈ దాడిని పాకిస్థాన్ ఆధారిత లష్కర్-ఎ-తొయిబాతో సంబంధం ఉన్న ది రెసిస్టెన్స్ ఫ్రంట్(TRF) అనే ఉగ్రవాద సంస్థ చేసినట్లు ప్రకటించుకుంది. కాగా ఈ ఘటనపై ఖతార్(Qatar) సంతాపం తెలిపింది. ఖతార్ అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-తానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఫోన్లో మాట్లాడారు. పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు.

ఈ దాడిని ఖతార్ తీవ్రంగా ఖండించింది. షేక్ తమీమ్ ఉగ్రవాదంపై పోరాటంలో భారతదేశానికి పూర్తి మద్దతు అందిస్తామని హామీ ఇచ్చారు. హింస, ఉగ్రవాద చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించబోమని, అటువంటి చర్యలను ఖండిస్తున్నట్లు స్పష్టం చేసింది. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ, బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపింది. ఖతార్ రాయబార కార్యాలయం న్యూ ఢిల్లీలోని లీగ్ ఆఫ్ అరబ్ స్టేట్స్ మిషన్ కూడా ఈ దాడిని ఖండిస్తూ, సంఘీభావం ప్రకటించింది.

Next Story