- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Qatar: భారత్ చేరుకున్న ఖతార్ ఎమిర్.. ఘన స్వాగతం పలికిన ప్రధాని మోడీ
రెండు రోజుల పర్యటన నిమిత్తం ఖాతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థాని భారత్‌కు చేరుకున్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: రెండు రోజుల పర్యటన నిమిత్తం ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థాని (Sheikh Tamim Bin Hamad Al-Thani) భారత్‌కు చేరుకున్నారు. ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన ఆయనకు ప్రధాని నరేంద్ర మోడీ (Narendra modi) ఘన స్వాగతం పలికారు. మోడీతో పాటు విదేశాంగ మంత్రి జైశంకర్ (Jai shanker) కూడా ఉన్నారు. తమీమ్ ఇండియా పర్యటన ఇరు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. రెండు రోజుల పాటు తమీమ్ పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. మంగళవారం ప్రధాని మోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ కానున్నారు. మోడీ ఆహ్వానం మేరకు ఖతార్ ఎమిర్ పర్యటన జరుగుతోంది. ఆయన భారత్‌లో అధికారికంగా పర్యటించడం ఇది రెండో సారి కావడం గమనార్హం. గతంలో 2015 మార్చిలోనూ భారత్‌ను సందర్శించారు.
కాగా, ఖతార్ భారత్‌కు అతిపెద్ద గ్యాస్ సరఫరా దారుగా ఉంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఖతార్‌తో ద్వైపాక్షిక వాణిజ్యం దాదాపు 18.77 బిలియన్లుగా ఉంది. రెండు దేశాల మధ్య బలమైన సంబంధాలు ఉన్నాయి. మోడీతో భేటీ సందర్భంగా ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించే అనేక అంశాలపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. అంతేగాక రెండు దేశాల మధ్య అవగాహన ఒప్పందాలు కూడా జరగనున్నట్టు సమాచారం. ఖతార్‌లో దాదాపు 8 లక్షల మంది భారతీయ పౌరులు ఉన్నారు. విదేశాంగ మంత్రి జైశంకర్ సైతం గతంలో అనేక సార్లు ఖతార్‌ను సందర్శించారు.






