పాకిస్థాన్‌కు విమానాలు నిలిపివేసిన ఖతార్‌ ఎయిర్‌వేస్‌

by Yella Dhawani Reddy |

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

పాకిస్థాన్‌కు విమానాలు నిలిపివేసిన ఖతార్‌ ఎయిర్‌వేస్‌
X

దిశ, వెబ్ డెస్క్: జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ దాడి అనంతరం వాఘా-అటారీ సరిహద్దు మూసివేత, పాక్ దౌత్యవేత్తలను వెనక్కి పంపడం, పాక్ పౌరులకు సార్క్ వీసాల రద్దు, సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం వంటి కీలక నిర్ణయాలు తీసుకుంది. అలాగే, భారత విమానయాన సంస్థలకు తమ గగనతలాన్ని పాకిస్థాన్ మూసివేసింది. ఈ క్రమంలో పాక్ సైతం తమ గగనతలాన్ని మూసివేసింది.

ఇక, ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) పేరుతో పాకిస్తాన్ ఉగ్రదాడికి భారత్‌ ప్రతీకార చర్యలు చేపట్టింది. మంగళవారం అర్ధరాత్రి 1:44 మెరుపు దాడులు నిర్వహించింది. ఇండియన్ ఆర్మీ, ఎయిర్‌ ఫోర్స్‌, నేవీ బలగాలు సంయుక్తంగా క్షిపణులతో లక్ష్యాలపై విరుచుకుపడ్డాయి. ఈ దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు.

ఈ నేపథ్యంలో భారత్, పాక్ ఉద్రిక్తత నేపథ్యంలో పాక్‌కు తాత్కాలికంగా విమాన సర్వీసులను ఖతార్ (Qatar) ఎయిర్‌వేస్ నిలిపివేసింది. పాక్ గగనతలం మూసివేయటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఖతార్ విమానయాన సంస్థ పేర్కొంది. పరిస్థితిని సునిశితంగా గమనిస్తున్నామని, ప్రయాణికులు, సిబ్బంది భద్రతే తమ మొదటి ప్రాధాన్యమని తెలిపింది.

Next Story