క్షణం.. క్షణం భయంగానే ఉంది: పీవీ సింధు

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-03-01 09:35:46  IST  )

దుబాయ్‌పై ఇరాన్ దాడుల కొనసాగుతున్నాయి. దీంతో ఆ దేశంలోని విమానాశ్రయాలను మూసి‌వేశారు. అంతేకాదు ప్రయాణికులను సుక్షితంగా హోటల్స్‌కు తరలించారు....

క్షణం.. క్షణం భయంగానే ఉంది: పీవీ సింధు
X

దిశ, వెబ్ డెస్క్: దుబాయ్‌పై ఇరాన్ దాడుల కొనసాగుతున్నాయి. దీంతో ఆ దేశంలోని విమానాశ్రయాలను మూసి‌వేశారు. అంతేకాదు ప్రయాణికులను సుక్షితంగా హోటల్స్‌కు తరలించారు. అయితే భారత బాడ్మింటన్ వీపీ సింధు దుబాయ్‌లో చిక్కుకుపోయారు. యూకేలో జరుగుతున్న ఆల్ ఇంగ్లండ్ ఓపెన్-2026కు వెళ్తుండగా విమాన సర్వీసులు నిలిచిపోవడంతో ఆమె అక్కడే ఉండిపోవాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే హోటల్‌లో సురక్షితంగానే ఉన్నప్పటికీ ఆమె భయాందోళన వ్యక్తం చేశారు. ‘‘ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయం కలుగుతోంది. మేము ఉన్న విమానాశ్రయానికి దగ్గర్లోనే బాంబు పేలింది. అయితే ఎయిర్ పోర్టు సిబ్బంది అప్రమత్తమైంది. తమను దగ్గర్లోని హోటల్‌కు తరలించారు. ప్రస్తుతం తామంతా సురక్షింగా ఉన్నాం. ’’ అని పీవీ సింధు తెలిపారు.

దుబాయ్‌లో పి.వి. సింధు.. యుద్ధ వాతావరణంపై బ్యాడ్మింటన్ స్టార్ ఆందోళన

Next Story