- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఖమేనీ సలహాదారుడితో పుతిన్ రహస్య భేటీ.. పశ్చిమాసియాలో ఉత్కంఠ ?
by B.Srinivas |
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ సీనియర్ సలహాదారుడు అలీ లారిజానితో భేటీ అయ్యారు.

X
దిశ, నేషనల్ బ్యూరో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Puthin) ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ సీనియర్ సలహాదారుడు అలీ లారిజానితో ఆదివారం భేటీ అయ్యారు. రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ లో ఈ సమావేశం జరగగా పశ్చిమ ఆసియాలోని ప్రస్తుత పరిస్థితి, ఇరాన్ అణు కార్యక్రమానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. మిడిల్ ఈస్ట్‌లో పెరుగుతున్న ఉద్రిక్తతలు, ఇరాన్ అణు కార్యక్రమంపై లారిజాని తన అభిప్రాయాలు తెలియజేశారని క్రెయ్లిన్ ప్రతినిధి డిమిత్రీ పెస్కోవ్ తెలిపారు. పుతిన్ సైతం తన డిసిషన్స్ వెల్లడించినట్టు పేర్కొన్నారు. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చితోనూ పుతిన్ ఇటీవల సమావేశమయ్యారు. ఈ క్రమంలోనే లారిజానితో భేటీ కావడం గమనార్హం. కాగా, రష్యా, ఇరాన్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం ఉంది.
Next Story






