Putin: అమెరికా ఆంక్షల వేళ భారత్ గడ్డపై రష్యా అధ్యక్షుడు కీలక ప్రకటన

by Prasad Jukanti |

భారత్ కు సహకారం విషయంలో పుతిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Putin: అమెరికా ఆంక్షల వేళ భారత్ గడ్డపై రష్యా అధ్యక్షుడు కీలక ప్రకటన
X

దిశ, డైనమిక్ బ్యూరో: గత అర్థ శతాబ్ధంగా భారత సైన్యానానికి ఆయుధాలు సమకూర్చడం వాటిని ఆధునీకరించడంలో రష్యా కీలక పాత్ర పోషిస్తోందని రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాలు ఈ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా పెంచుతాయని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. భారత్ కు రక్షణ సహకారాన్ని మరింత విస్తరిస్తామని చెప్పారు. టెర్రరిజానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో భారత్ తో కలిసి నడుస్తామని టెర్రరిజాన్ని పూర్తిగా నాశనం చేసేందుకు భారత్‍కు అండగా ఉంటామని స్పష్టం చేశారు. భారత పర్యటనలో ఉన్న రష్యా అధ్యక్షుడు పుతిన్‌ (Vladimir Putin) శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో (Narendra Modi) ప్రత్యేకంగా భేటీ అయ్యారు. హైదరాబాద్‌ హౌస్‌ వేదికగా ఇరు దేశాధినేతలు 23వ ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. పలు అంశాలపై వీరు విస్తృతంగా చర్చించారు. ఆహార భద్రత, ఆరోగ్య రంగం, వాణిజ్యం, రక్షణ రంగం, కెమికల్స్‌, ఫెర్టిలైజర్స్‌, లేబర్‌ మైగ్రేషన్‌ మొబిలిటీ, పోర్టులు, నౌకాయానంతో పాటు పలు అంశాలపై ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి. ఇందులో గంగా భారత్‌ ప్రధాని నరేంద్ర మోడీ-రష్యా అధ్యక్షడు పుతిన్‌ల సంయుక్త మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

ఇంధన సరఫరా కొనసాగిస్తాం:పుతిన్

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన పుతిన్.. తనకు అపూర్వ స్వాగతం పలికిన భారతీయులకు కృతజ్ఞతలు. భారత్ ఆతిథ్యం సంతోషాన్ని ఇచ్చిందన్నారు. అనేక అంశాల్లో ఇరు దేశాల మధ్య అవగాహన కుదిరిందని విభిన్న అంశాలపై ఇరు దేశాలు తమ అభిప్రాయాలను పంచుకున్నాయని పుతిన్ చెప్పారు. ఇరు దేశాల ద్వైపాక్షిక వాణిజ్యం 2030 నాటికి 100 బిలియన్ డాలర్లకు చేరుతుందని పుతిన్ ఆశాభావం వ్యక్తం చేశారు. గతేడాది భారత్-రష్యా (India–Russia) మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 12 శాతం పెరిగి రికార్డు సృష్టించిందని ఈ ఏడాది కూడా అదే స్థాయిలో పెరుగుదల ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇరు దేశాల మధ్య ట్రేడ్ మరింతగా పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. సొంత కరెన్సీల్లోనే ఇరు దేశాల మధ్య వాణిజ్యం జరుగుతోందన్నారు. అమెరికా లాంటి దేశాల నుంచి వాణిజ్య ఒత్తిడులు ఎదురైతున్నప్పటికీ పెరుగుతున్న భారత ఆర్థిక వ్యవస్థ కోసం నిరంతరాయంగా ఇంధన రవాణాను కొనసాగించడానికి రష్యా సిద్ధంగా ఉందని చెప్పారు. కొడంకుళం అణువిద్యుత్త ప్రాజెక్టుకు రష్యా సహకరిస్తోందని చెప్పిన పుతిన్..ఇరు దేశాలు అతి పెద్ద భారతీయ అణు విద్యుత్ ప్లాంట్ ను నిర్మించే ప్రాజెక్టుపై పని చేస్తున్నాయని, ఆరు రియాక్టర్లలో ముడు ఇప్పటికే ఇంధన నెట్ వర్క్ కు అనుసంధానించబడ్డాయని చెప్పారు. విద్యుత్ రంగంలో ఖర్చు తగ్గించుకోవడానికి కావాల్సిన సాయం అందిస్తామన్నారు. హై క్వాలిటీ మెడిసినల్ డ్రగ్స్ విషయంలో భారత్ తో కలిసి పని చేస్తున్నామన్నారు. బ్రిక్స్, ఎస్‍సీఓ లోనిసారూప్య ఆలోచనచలు కలిగిన దేశాలతో రష్యా, భారత్ సంతంత్ర, స్వయం సమృద్ధిగల విదేశాంగ విధానాన్ని నిర్వహిస్తున్నాయని రెండు దేశాలు ఐక్యరాజ్యసమితి ప్రధాన సూత్రాన్ని సమర్ధిస్తున్నాయని చెప్పారు. రష్యా లేదా బెలారస్ నుంచి హిందూ మహాసముద్ర తీరం వరకు ఉత్తర-దక్షిణ రవాణా కారిడార్ ను రూపొందించే ప్రాజెక్టుతో సహా కొత్త అంతర్జాతీయ రవాణా మార్గాలను నిర్మించడానికి తమ దేశం భారత్ తో కలిసి పని చేస్తోందని అన్నారు.

Next Story