- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Puthin: త్వరలోనే భారత పర్యటనకు రష్యా అధ్యక్షుడు పుతిన్ !
ఉగ్రవాదంపై పోరాటంలో భారత్‌కు పూర్తి మద్దతిస్తామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పష్టం చేశారు. ఈ మేరకు భారత ప్రధాని మోడీతో సోమవారం ఫోన్‌లో మాట్లాడారు.

దిశ, నేషనల్ బ్యూరో: ఉగ్రవాదంపై పోరాటంలో భారత్‌కు పూర్తి మద్దతిస్తామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Puthin) స్పష్టం చేశారు. ఈ మేరకు భారత ప్రధాని నరేంద్ర మోడీ (Narendra modi) తో సోమవారం ఫోన్‌లో మాట్లాడారు. జమ్మూ కశ్మీర్ (Jammu Kashmir) లోని పహెల్గాంలో జరిగిన ఉగ్ర దాడిని తీవ్రంగా ఖండించారు. 26 మంది ప్రాణాలు కోల్పోవడంపై సంతాపం వ్యక్తం చేశారు. టెర్రరిజంపై పోరులో భారత్‌కు మద్దతిస్తామని, దాని వెనుక ఉన్నవారిని చట్టం ముందు నిలబెట్టాలని పుతిన్ నొక్కి చెప్పారు. అలాగే భారత్-రష్యాల మధ్య ప్రత్యేక, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి ఇద్దరు నాయకులు అంగికరించినట్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సంభాషణ సందర్భంగా అధ్యక్షుడు పుతిన్‌కు ప్రధానమంత్రి రష్యా 80వ విజయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
అలాగే ఈ సంవత్సరం చివరలో భారత్‌లో జరగనున్న భారత్- రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశానికి పుతిన్‌ను ఆహ్వానించారు. మోడీ విజ్ఞప్తికి పుతిన్ అంగీకరించినట్టు తెలుస్తోంది. దీంతో త్వరలోనే పుతిన్ భారత్‌లో పర్యటించనున్నట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. పుతిన్ ఇండియాకు వస్తే రష్యా ఉక్రెయిన్ యుద్ధం తర్వాత తొలి భారత పర్యటన అవుతుంది. అంతకుముందు పుతిన్ 2021లో భారత్‌కు వచ్చారు. రష్యా విదేశాంగ మంత్రి లావ్రోవ్ సైతం ఉగ్రదాడి తర్వాత జైశంకర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. టెర్రరిస్ట్ అటాక్‌ను తీవ్రంగా ఖండించారు. దీనికి సంబంధించిన పరిణామాలపై డిస్కస్ చేశారు.






