Puthin: త్వరలోనే భారత పర్యటనకు పుతిన్.. ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ వెల్లడి

by B.Srinivas |   (  Updated:2025-08-07 12:46:55  IST  )

రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ ఏడాది చివరలో భారత్‌లో పర్యటించనున్నారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ విషయాన్ని వెల్లడించారు.

Puthin: త్వరలోనే భారత పర్యటనకు పుతిన్.. ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ వెల్లడి
X

దిశ, నేషనల్ బ్యూరో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) ఈ ఏడాది చివరలో భారత్‌లో పర్యటించనున్నారు. ప్రస్తుతం రష్యా టూర్‌లో ఉన్న భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ (Ajith doval) ఈ విషయాన్ని వెల్లడించారు. త్వరలోనే పుతిన్ పర్యటన తేదీలు ఖరారు చేయనున్నట్టు తెలిపారు. రష్యా భద్రతా మండలి కార్యదర్శి సెర్గీ షోయిగుతో దోవల్ గురువారం భేటీ అయ్యారు. ఈ సమావేశం అనంతరం పుతిన్ పర్యటనపై ప్రకటన చేశారు. పుతిన్ సందర్శన పట్ల భారత్ ఉత్సాహంగా ఉందన్నారు. రెండు దేశాలు బలమైన స్నేహపూర్వక సంబంధాలతో ముడిపడి ఉన్నాయని తెలిపారు. వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఎంతో విలువైనదిగా భావిస్తున్నట్టు చెప్పారు. కాగా, చమురు కొనుగోలు చేయడం ద్వారా ఉక్రెయిన్ యుద్ధంలో భారత్ రష్యాకు నిధులు సమకూరుస్తోందని ట్రంప్ ఆరోపించారు. ఈ కారణంతోనే 50 శాతం సుంకాలు విధించారు. ఈ క్రమంలోనే పుతిన్ పర్యటన జరగనుండటం గమనార్హం. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత పుతిన్ భారత్‌కు రావడం ఇదే తొలిసారి. మరోవైపు పుతిన్ త్వరలోనే అమెరికా అధ్యక్షుడు ట్రంపుతోనూ భేటీ కానున్నట్టు పలు కథనాలు వెల్లడించాయి.

Next Story