- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Puthin: ఉక్రెయిన్ పౌరులంతా మావాళ్లే.. రష్యా అధ్యక్షుడు పుతిన్
రష్యన్లు, ఉక్రెనియన్లు ఒకే జాతి ప్రజలు అని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: రష్యన్లు, ఉక్రెనియన్లు ఒకే జాతి ప్రజలు అని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Puthin) అన్నారు. ఆ కోణంలో చూసినప్పుడు సిద్ధాంత పరంగా ఉక్రెయిన్ మొత్తం తమదేనని తెలిపారు. సెయింట్ పీటర్ బర్గ్‌లో తాజాగా జరిగిన ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరమ్ (International economic forum) సదస్సులో ఆయన ప్రసంగించారు. ఉక్రెయిన్ నగరమైన సుమీని రష్యన్ దళాలు తమ ఆధీనంలోకి తీసుకునే అవకాశం ఉందన్నారు. జాతీయ భద్రతను కాపాడుకోవాల్సిన అవసరం ఏర్పడటంతోనే కీవ్‌లో రష్యా సైనిక చర్యలు కొనసాగుతున్నాయని నొక్కి చెప్పారు. రష్యన్ భూభాగాన్ని బెదిరింపుల నుంచి రక్షించడానికి ఉక్రెయిన్‌లోని ఈశాన్య సుమీ (Sumy) ప్రాంతంలో రష్యన్ బలగాలు ప్రస్తుతం బఫర్ జోన్‌ను ఏర్పాటు చేస్తున్నాయన్నారు.
ప్రస్తుత యుద్ధంలోఉక్రెయిన్ లొంగిపోవాలని తాము డిమాండ్ చేయడం లేదన్నారు. రష్యన్ సైనికులు ఎక్కడ అడుగు పెడితే, ఆ స్థలం తమదే అవుతుందనే ఒక పాత సామెత ఉందని గుర్తు చేశారు. మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధం గురించి పుతిన్ స్పందిస్తూ.. అణుశక్తిని శాంతియుతంగా ఉపయోగించడంతో సహా దాని చట్టబద్ధమైన ప్రయోజనాలను కొనసాగించే హక్కు ఇరాన్‌కు ఉందని స్పష్టం చేశారు.






