- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Breaking News : కదులుతున్న రైల్లోంచి గర్భిణీని నెట్టివేసిన కామాంధుడు
తమిళనాడు(Tamilanadu)లో దారుణ ఘటన చోటు చేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్ : తమిళనాడు(Tamilanadu)లో దారుణ ఘటన చోటు చేసుకుంది. నిండు గర్భిణీ అని కూడా చూడకుండా ఓ కామాంధుడు మహిళపై దారుణానికి ఒడిగట్టాడు. ఆమె ప్రతిఘటించడంతో కదులుతున్న రైల్లోంచి బయటికి తోసివేశాడు(Throwing out of a moving train). రైల్లో ప్రయాణించిన పాపానికి ప్రస్తుతం ఆమె చావు బతుకుల మధ్య ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతోంది. సమాజం సిగ్గుపడే ఈ అమానవీయ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. చిత్తూరుకు చెందిన నిండు గర్భవతి అయిన ఓ మహిళ కోయంబత్తూరు- తిరుపతి ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ ట్రైన్(Coibatore - Tiruparti Inter City Express Train)లో ప్రయాణిస్తుండగా.. కేవీ కుప్పం స్టేషన్ సమీపంలో బాత్రూమ్కి వెళ్లిన సమయంలో హేమరాజ్ అనే కామాంధుడు ఆమెపై లైంగిక వేధింపులకు(Sexual Harassment) పాల్పడ్డాడు. ఆమె తాను గర్భవతిని వదిలి వేయాలని అరుస్తున్నా వేడుకున్నా.. అత్యాచార యత్నానికి ఒడిగట్టాడు.
మహిళ సహాయం కోసం గట్టిగ కేకలు వేయగా.. గమనించిన తోటి ప్రయాణికులు అక్కడికి చేరేలోపు ఆమెను రైల్లోనుంచి కిందికి నెట్టివేశాడు. తక్షణమే ట్రైన్ గొలుసు లాగిన ప్రయాణికులు సమాచారాన్ని రైల్వే పోలీసులకు చేరవేశారు. రక్తమోడుతూ.. ప్రాణాపాయ స్థితిలో కొట్టుకుంటున్న సదరు మహిళను ప్రయాణీకుల సహాయంతో పోలీసులు ఆసుపత్రికి చేర్చి చికిత్స అందిస్తున్నారు. కాగా ఇంతటి ఘోరానికి పాల్పడ్డ నిందితున్ని తోటి ప్రయాణికులు పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం నిందితుడు హేమరాజ్ కాట్పాడి రైల్వే పోలీసు(లKatpadi Railway Police) అదుపులో ఉండగా.. గతంలోనూ అనేక కేసులు నిందితునిపై ఉన్నట్టు పోలీసులు తెలియజేశారు. ఇక మహిళ వివరాలు సేకరించేందుకు తిరుపతి పోలీసులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం.






