పూరీ రథయాత్ర లో తొక్కిసలాట ఘటన అత్యంత విషాదకరం: రాహుల్ గాంధీ

by Malleboina Mahesh |

భారత దేశంలోనే అతిపెద్ద రథ యాత్ర.. ఒడిశా(Odisha)లోని పూరీ జగన్నాథ ఆలయం వద్ద జరుగుతుంది.

పూరీ రథయాత్ర లో తొక్కిసలాట ఘటన అత్యంత విషాదకరం: రాహుల్ గాంధీ
X

దిశ, వెబ్‌డెస్క్: భారత దేశంలోనే అతిపెద్ద రథ యాత్ర.. ఒడిశా(Odisha)లోని పూరీ జగన్నాథ ఆలయం వద్ద జరుగుతుంది. శుక్రవారం ఈ రథయాత్ర(Puri Jagannath Rath Yatra) ప్రారంభం కాగా.. ఆదివారం తెల్లవారుజామున తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ముగ్గురు భక్తులు మృతి చెందారు. 60 మంది వరకు భక్తులకు గాయాలు అయ్యాయి. కాగా ఈ తొక్కిసలాట ఘటనపై స్పందించిన సీఎం.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. కాగా ఈ తొక్కిసలాట ఘటనపై పార్లమెంట్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా స్పందించారు. ఆయన తన ట్వీట్‌లో "పూరీలో రథయాత్ర సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటన అత్యంత విషాదకరం.

మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. గాయపడిన భక్తులు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను. సహాయ చర్యలను వేగవంతం చేయాలని, ఈ విషయంలో సాధ్యమైన ప్రతి సహాయాన్ని అందించాలని కాంగ్రెస్ కార్యకర్తలను కోరుతున్నాను. ఈ విషాదం ఒక తీవ్రమైన హెచ్చరిక - ఇంత పెద్ద కార్యక్రమాలకు, భద్రతా ఏర్పాట్లు, జనసమూహ నిర్వహణ సన్నాహాలను తీవ్రంగా పరిగణించి పూర్తిగా సమీక్షించాలి. ప్రజల ప్రాణాలను రక్షించడం చాలా ముఖ్యమైనది , ఈ బాధ్యతలో ఎటువంటి లోపాలు ఆమోదయోగ్యం కాదు." అని రాహుల్ గాంధీ తన ట్వీట్ లో రాసుకొచ్చారు.

Next Story