- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Punjab Police: భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న పంజాబ్ పోలీసులు
పంజాబ్ పోలీసులు భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. పాకిస్థాన్(Pakisthan) నుంచి భారత్ లోకి డ్రగ్స్ తరలిస్తున్న ముఠాను పంజాబ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: పంజాబ్ పోలీసులు భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. పాకిస్థాన్(Pakisthan) నుంచి భారత్ లోకి డ్రగ్స్ తరలిస్తున్న ముఠాను పంజాబ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 85 కేజీల డ్రగ్స్‌ను (Heroin) పోలీసులు సీజ్ చేశారు. ఈ విషయాన్ని పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్‌లో దీని విలువ రూ.వందల కోట్లలో ఉంటుందని అంచనా. అమృత్‌సర్‌కు చెందిన అమర్‌జోత్ సింగ్ జోతా సంధును ఇందులో ప్రధాన నిందితుడిగా గుర్తించి, అరెస్టు చేశామన్నారు. ఈ పాక్ స్మగ్లింగ్ ముఠాను యూకే నుంచి లల్లీ అనే వ్యక్తి నడిపిస్తున్నాడని తెలిపారు. ఈ మొత్తం వ్యవహారంలో అమర్‌జోత్ నివాసం డ్రగ్స్ సరఫరాకు ప్రధాన కేంద్రంగా మారిందని పోలీసులు వెల్లడించారు. పాక్ నుంచి వచ్చిన మాదక ద్రవ్యాలను అతడే దేశంలోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నాడని తెలిపారు. పాక్‌లోని ఐఎస్‌ఐ ఏజెంట్లతోనూ ఈ ముఠాకు సంబంధాలు ఉన్నాయని అన్నారు. మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి దర్యాప్తు వేగవంతం చేసినట్లు పేర్కొన్నారు. "మాదకద్రవ్యాలపై పోరాటంలో పంజాబ్ పోలీసులు అచంచలంగా ఉన్నారు. ఇలాంటి రికవరీలు పంజాబ్ ను మాదకద్రవ్య రహితంగా మార్చాలనేది మా సంకల్పం" అని డీజీపీ అన్నారు.






