- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Punjab:పంజాబ్‌లోని జలంధర్, అమృత్‌సర్‌లో పేలుళ్లు
అత్యంత సున్నితమైన ప్రాంతాల సమీపంలో రెండు పేలుళ్లు సంభవించడంతో రాష్ట్రవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు.

దిశ, నేషనల్ బ్యూరో: పంజాబ్‌లో వరుస పేలుళ్లు కలకలం రేపుతున్నాయి. ఫలితంగా రాష్ట్రంలో భద్రతా పరిస్థితులు మరోసారి ఆందోళన కలిగిస్తున్నాయి. మంగళవారం రాత్రి కేవలం మూడు గంటల వ్యవధిలో జలంధర్, అమృత్‌సర్‌లలోని అత్యంత సున్నితమైన ప్రాంతాల సమీపంలో రెండు పేలుళ్లు సంభవించడంతో రాష్ట్రవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. ఈ ఘటనల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే, భద్రతా లోపాలపై తీవ్ర ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాష్ట్రంలో 10 రోజుల వ్యవధిలో ఇది మూడో పేలుడు కావడంతో, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), కేంద్ర ఫోరెన్సిక్ బృందాలు ఈ ఘటనలపై దర్యాప్తును ప్రారంభించాయి.
మొదటి ఘటన మంగళవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో జలంధర్‌లోని బీఎస్ఎఫ్ పంజాబ్ ఫ్రాంటియర్ ప్రధాన కార్యాలయం వెలుపల జరిగింది. పార్క్ చేసి ఉన్న యాక్టివా స్కూటర్‌లో సంభవించిన పేలుడు తీవ్రత ఎక్కువగా ఉండడంతో పరిసర ప్రాంతాలు ధ్వంసమయ్యాయి. దీని వెనుక తమ హస్తముందని ఖలిస్థానీ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. ఆ తర్వాత రాత్రి 11.15 గంటలకు, అమృత్‌సర్‌లోని ఖాసా కంటోన్మెంట్ సమీపంలో మరో పేలుడు చోటుచేసుకుంది. వాఘా సరిహద్దుల్లో సైన్యం, బీఎస్ఎఫ్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగింది.
ఈ ఏడాది పంజాబ్‌లో వరుస పేలుళ్లు
గత కొద్ది నెలలుగా పంజాబ్‌లో వరుస పేలుళ్లు జరుగుతున్నాయి. ఏప్రిల్ 27న పాటియాలా జిల్లాలోని రాజ్‌పురా-శంభు ట్రాక్ సమీపంలో పేలుడు సంభవించింది. పరికరాన్ని అమర్చేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో అనుమానిత బాంబర్ ఒకరు హతమయ్యాడు. ఏప్రిల్ 1న చండీగఢ్‌లోని సెక్టార్ 37లో ఉన్న పంజాబ్ బీజేపీ ప్రధాన కార్యాలయంపైకి గుర్తు తెలియని వ్యక్తులు నాటు గ్రెనేడ్‌ను విసిరారు. అంతకుముందు జనవరి 23న ఫతేగఢ్ సాహిబ్‌లోని సిర్‌హింద్ రైల్వే స్టేషన్ సమీపంలో ట్రాక్‌పై పేలుడు జరిగింది. కాగా, 2024, సెప్టెంబర్ నుంచి ఇప్పటివరకు 20కి పైగా ఘటనలు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది.






