Punjab: పంజాబ్‌లో భారీ వరదలు.. నెల జీతం విరాళంగా ప్రకటించిన ఆప్ ఎమ్మెల్యేలు

by B.Srinivas |

ఇటీవల భారీ వర్షాలు, వరదల కారణంగా పంజాబ్ అతలాకుతలం అయిన విషయం తెలిసిందే.

Punjab: పంజాబ్‌లో భారీ వరదలు.. నెల జీతం విరాళంగా ప్రకటించిన ఆప్ ఎమ్మెల్యేలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇటీవల భారీ వర్షాలు, వరదల కారణంగా పంజాబ్ అతలాకుతలం అయిన విషయం తెలిసిందే. దీంతో ఆ రాష్ట్రంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (Aap) ఎమ్మెల్యేలు, ఎంపీలు వరద సహాయక చర్యలకు మద్దతుగా తమ నెల జీతాన్ని విరాళంగా అందించనున్నట్టు ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ (Aravind Kejriwal) ప్రకటించారు. ఈ సంక్షోభ సమయంలో పంజాబ్‌కు మద్దతివ్వాలని రాజకీయ పార్టీలు, కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పంజాబ్ ఇబ్బందుల్లో ఉందని ఆదుకోవాలని కోరారు. కాగా, భారీ వర్షాల వల్ల పంజాబ్ తీవ్రంగా ప్రభావితమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 30 మంది ప్రాణాలు కోల్పోగా అనేక మంది నిరాశ్రయులయ్యారు. 96,000 హెక్టార్లకు పైగా పంటలు నీట మునిగింది. జలంధర్, అమృత్‌సర్, బర్నాలా, హోషియార్‌పూర్, లూథియానా, మాన్సా ప్రాంతాలు ఎక్కువగా ప్రభావితమైనట్టు అధికారులు తెలిపారు. మరోవైపు మంగళవారం కూడా పంజాబ్ లో భారీ వర్షాలు కురిశాయి. గత 24 గంటల్లో మొహాలిలో అత్యధికంగా 44.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

Next Story