వరదలో చిక్కుకున్న వేలాది మూగ జీవాలు.. కంటతడి పెట్టిస్తున్న దృశ్యాలు

by Sujitha Rachapalli |   (  Updated:2025-08-28 13:45:41  IST  )

పంజాబ్‌ను వరదలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాల కారణంగా డ్యామ్‌ల నుంచి నీరు విడుదల చేయడంతో పరిస్థితి తీవ్రంగా మారింది. ఇప్పటికే పాకిస్తాన్‌లో సరిహద్దు వరద హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి. మరోవైపు అమృత్‌సర్‌లో వరదల్లో చిక్కుకున్న వారిని

వరదలో చిక్కుకున్న వేలాది మూగ జీవాలు.. కంటతడి పెట్టిస్తున్న దృశ్యాలు
X

దిశ, వెబ్ డెస్క్ : పంజాబ్‌ను వరదలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాల కారణంగా డ్యామ్‌ల నుంచి నీరు విడుదల చేయడంతో పరిస్థితి తీవ్రంగా మారింది. ఇప్పటికే పాకిస్తాన్‌లో సరిహద్దు వరద హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి. మరోవైపు అమృత్‌సర్‌లో వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు భారతసైన్యం అత్యాధునికి వాహనాలను రంగంలోకి దించింది. ATOR N1200 అమ్ఫీబియన్ వెహికిల్స్‌ను స్థానికులను కాపాడేందుకు వినియోగిస్తోంది. అయితే మనుషులతోపాటు మూగ జీవాలు కూడా వరదల విలయతాండవానికి బలవుతున్నాయి. నివాస ప్రాంతాల్లోకి నీరు చేరి వేల సంఖ్యలో ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు వరదలోనే బిక్కుబిక్కుమంటూ గడిపేస్తున్నాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి. వరుణుడు శాంతించాలని.. మూగజీవాలను కాపాడాలని ప్రార్థిస్తున్నారు జనాలు.

Next Story