రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన వరదలు.. సెప్టెంబర్ 7 వరకు స్కూళ్లకు సెలవులు

by Sujitha Rachapalli |   (  Updated:2025-09-03 08:19:51  IST  )

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు రాష్ట్రాల్లో పరిస్థితి తీవ్రంగా మారింది. ముఖ్యంగా పంజాబ్, జమ్ముకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో వరదల ధాటికి జనాలతోపాటు పశుపక్ష్యాదులు కూడా ప్రాణాలు కోల్పోతున్నాయి.

రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన వరదలు.. సెప్టెంబర్ 7 వరకు స్కూళ్లకు సెలవులు
X

దిశ, వెబ్ డెస్క్ : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు రాష్ట్రాల్లో పరిస్థితి తీవ్రంగా మారింది. ముఖ్యంగా పంజాబ్, జమ్ముకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో వరదల ధాటికి జనాలతోపాటు పశుపక్ష్యాదులు కూడా ప్రాణాలు కోల్పోతున్నాయి. పంజాబ్‌లో 23 జిల్లాలు భారీగా ఎఫెక్ట్ కాగా 1400కుపైగా గ్రామాలు వర్షాల ధాటికి అతలాకుతలమయ్యాయి. పంజాబ్ ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రం మొత్తాన్ని విపత్తు ప్రభావిత ప్రాంతంగా ప్రకటించింది. మరోవైపు ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని స్కూళ్లు, కాలేజీలు, విశ్వవిద్యాలయాలను సెప్టెంబర్ ఏడో తేదీ వరకు మూసేస్తున్నట్లు ఆ రాష్ట్ర మంత్రి హర్జోత్ సింగ్ బెయిన్స్ తెలిపారు.

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోగా.. అధికారులు, సైన్యం సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. ఇక ఫ్లడ్స్ కారణంగా పంజాబ్‌లో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఆరు వేల కోట్ల రూపాయల అత్యవసర సాయాన్ని అందించాలని ప్రధాని మోడీని కోరారు రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్. ఇక ఆ దేశంలో వరదలకు సంబంధించిన వీడియో షేర్ చేసిన రాహుల్ గాంధీ.. వేలాది కుటుంబాలు తమ ఇళ్లు, ప్రాణాలు, ఆత్మీయులను కాపాడుకునేందుకు పోరాడుతున్నాయని, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి సాయం అందాల్సిన అవసరం ఉందన్నారు. రైతులకు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలని.. సహాయక చర్యలను మరింత వేగవంతం చేయాలని కోరారు.

Next Story