- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డెలివరీ బాయ్‌పై రేప్ కేసు పెట్టిన మహిళా టెక్కీ.. రివర్స్‌లో బుక్కైందిగా..
డెలివరీబాయ్ తనపై అత్యాచారం చేశాడంటూ ఓ మహిళా టెక్కీ కేసు పెట్టగా.. ఆ కేసు తిరిగి ఆమె మెడకే చుట్టుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: డెలివరీబాయ్ తనపై అత్యాచారం చేశాడంటూ ఓ మహిళా టెక్కీ కేసు పెట్టగా.. ఆ కేసు తిరిగి ఆమె మెడకే చుట్టుకుంది. ఈ సంఘటన పుణేలో చోటుచేసుకుంది. జులై 3న 22 ఏళ్ల మహిళా టెక్కీ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో.. డెలివరీ ఏజెంట్ గా వచ్చిన వ్యక్తి తన ఫ్లాట్ లోకి చొరబడి అత్యాచారం చేశాడని ఆరోపించింది. ఆ తర్వాత తాను స్పృహ కోల్పోయేలా చేసి.. తన ఫొటోలు తీసుకున్నాడని తెలిపింది. ఈ విషయం బయటకు చెప్తే.. సోషల్ మీడియాలో వాటిని పోస్ట్ చేస్తానని బెదిరించాడని పోలీసులకు వివరించింది. ఇందుకు కొన్ని సాక్ష్యాలను కూడా సమర్పించింది.
కాగా.. పోలీసులు ఈ కేసుపై విచారణ చేశాక అసలు విషయం బయటపడింది. ఆ మహిళా టెక్కీ అబద్ధపు ఫిర్యాదు చేసిందని తేలింది. ఆమె చెప్పిన డెలివరీ బాయ్ ఆమె ఫ్రెండేనని, ఎలాంటి అఘాయిత్యం జరగలేదని గుర్తించారు. అబద్ధపు ఫిర్యాదు చేసిందని తేలడంతో.. రివర్స్ లో ఆమె పైనే కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు చేసి తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.






