పూణే మెట్రో లీక్.. వర్షం నీళ్లు రావడంతో ప్రయాణికులు షాక్

by Ajay Maddhiboyina |   (  Updated:2026-05-23 09:08:02  IST  )

మహారాష్ట్రలోని పూణేలో కురిసిన భారీ వర్షానికి మెట్రోలో రైలులోకి నీళ్లు వచ్చాయి. పింప్రి-స్వార్గేట్ ప‌ర్పుల్ లైన్‌లోని మెట్రో రైలు కోచ్ పై కప్పు నుండి నీరు లీక్ అయ్యింది. దీంతో ప్రయాణికులు ఆందోళన చెందారు.

పూణే మెట్రో లీక్.. వర్షం నీళ్లు రావడంతో ప్రయాణికులు షాక్
X

దిశ, వెబ్ డెస్క్: మహారాష్ట్రలోని పూణేలో కురిసిన భారీ వర్షానికి మెట్రోలో రైలులోకి నీళ్లు వచ్చాయి. పింప్రి-స్వార్గేట్ ప‌ర్పుల్ లైన్‌లోని మెట్రో రైలు కోచ్ పై కప్పు నుండి నీరు లీక్ అయ్యింది. దీంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. నీళ్లు కురిసిన సమయంలో మెట్రోలో రద్దీ ఎక్కువగా ఉండటంతో ప్రయాణికులు తడవకుండా ఉండేందుకు పక్కకి జరుగుతూ చాలా ఇబ్బందిపడ్డారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీడియోలు చూస్తుంటే మెట్రో నాణ్యతపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

బయట నుండి చూసేందుకు ఎంతో నాణ్యతగా, చక్కగా కనిపించే మెట్రో మరీ నీళ్లు లోపలకు వచ్చేలా ఉందేంటి అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. మరోవైపు కొందరు నెటిజన్లు పూణే మెట్రో అధికారులకు ట్యాగ్ చేస్తూ వెంటనే రిపేర్ చేయాలని కోరుతున్నారు. ఇక ప్రతిపక్షాలు సైతం మెట్రోలో నీళ్లు రావడంపై విమర్శలు కురిపిస్తున్నాయి. ప్రస్తుతం మహారాష్ట్రలో బీజేపీ సర్కార్ ఉండటంతో డబుల్ ఇంజిన్ సర్కార్ లో ఇలాంటివి కామనే అంటూ సెటైర్లు వేస్తున్నాయి.

Next Story