- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మతాన్ని రెచ్చగొట్టేలా పోస్టులు..1500 కిమీ వెళ్లి అరెస్ట్ చేసిన పోలీసులు
ఆపరేషన్ సిందూర్‌పై పాకిస్థాన్ ఫాలోవర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ అభ్యంతకర వ్యాఖ్యలు చేసిందని శుక్రవారం రాత్రి కోల్ కతా పోలీసులు 1500 కిలోమీటర్లు ప్రయాణించి ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ను అరెస్ట్ చేశారు.

దిశ, వెబ్ డెస్క్: ఆపరేషన్ సిందూర్‌పై పాకిస్థాన్ ఫాలోవర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ అభ్యంతకర వ్యాఖ్యలు చేసిందని శుక్రవారం రాత్రి కోల్ కతా పోలీసులు 1500 కిలోమీటర్లు ప్రయాణించి ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ను అరెస్ట్ చేశారు. శర్మిష్ఠ పనోలి అనే పూణేకు చెందిన లా విద్యార్థిని మరియు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఓ మతాన్ని లక్ష్యంగా చేసుకుని, అగౌరవపరిచే మరియు అవమాకరమైన వ్యాఖ్యలు చేస్తూ ఇన్‌స్టాలో వీడియోను అప్‌లోడ్ చేసింది. దీంతో ఆమెను అత్యాచారం చేస్తామని, హతమారుస్తామని బెదిరింపులు వచ్చాయి.
తరవాత ఆ వీడియోను డిలీట్ చేసి యువతి క్షమాపణలు కోరుతూ మరో పోస్ట్ పెట్టింది. అయితే అప్పటికే వీడియో వైరల్ అయ్యింది. కేసు నమోదు చేసుకున్న కోల్‌కతా పోలీసులు పూణేకు చేరుకుని ఆమెను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేసి యువతిని అరెస్ట్ చేయడంతో ఆమెకు మద్దతూ ఇస్తూ కొందరు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. కోల్‌కతాలోని ముర్షిదాబాద్‌లో మతకల్లోలాలతో ఓ వర్గంపై దాడి జరుగుతుంటే అక్కడి పోలీసులు 19ఏళ్ల యువతిని అరెస్ట్ చేయడానికి వందల కిలోమీటర్లు వెళ్లారని మండిపడుతున్నారు.






