PSLV-C59: నేడు నింగిలోకి పీఎస్ఎల్‌వీ - సీ59.. కౌంట్‌డౌన్ స్టార్ట్

by Kema Shiva Kumar |

శ్రీహరికోట (Sriharikota)లోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) (Sathish Dhawan Space Center) మొదటి ప్రయోగ వేదిక నుంచి బుధవారం సాయంత్రం 4.08 గంటలకు పీఎస్ఎల్‌వీ-సీ59 (PSLV-C59) నింగిలోకి దూసుకెళ్లనుంది.

PSLV-C59: నేడు నింగిలోకి పీఎస్ఎల్‌వీ - సీ59.. కౌంట్‌డౌన్ స్టార్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: శ్రీహరికోట (Sriharikota)లోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) (Sathish Dhawan Space Center) మొదటి ప్రయోగ వేదిక నుంచి బుధవారం సాయంత్రం 4.08 గంటలకు పీఎస్ఎల్‌వీ-సీ59 (PSLV-C59) నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ మేరకు అధికారులు మంగళవారం మధ్యాహ్నం 2.38 గంటలకు కౌంట్‌డౌన్‌ (Count Down)ను ప్రారంభించారు. యురోపియన్ స్పేస్ ఏజెన్సీ (European Space Agency)కి చెందిన ప్రోబా-3 (Proba-3) ఉపగ్రహాలను పీఎస్ఎల్‌వీ-సీ59 (PSLV-C59) తీసుకెళ్లనుంది. సూర్యుడి కరోనాపై ప్రోబా-3 (PSLV-C59) ఉపగ్రహం పరిశోధనలు చేయనుంది.

కరోనా పరిశీలనలో ఇబ్బందులను అధిగమించేలా ప్రోబా-3 (PSLV-C59) పని చేయనుంది. కృత్రిమ సూర్య గ్రహణాలను సృష్టించి కరోనాను శోధించడం ఈ ఉపగ్రహం ప్రత్యేకత. ప్రోబా-3 (PSLV-C59) ఉపగ్రహ జీవిత కాలం రెండేళ్లు కాగా.. ఈ ప్రయోగానికి రూ.1,800 కోట్లు ఖర్చు చేశారు. ప్రోబా-3లో రెండు ఉపగ్రహాలు ఉన్నాయి. అందులో ఒకటి ఆకల్టర్ స్పేస్ క్రాఫ్ట్ (Occult Space Craft) (ఓఎస్‌సీ) దాని బరువు 200 కిలోలు, రెండోది కరోనాగ్రాఫ్ స్పేస్ క్రాఫ్ట్ (Coronagraph Space Craft) (సీఎస్సీ) దాని బరువు 340 కిలోలు. ప్రోబా-3 ఉపగ్రహ భాగస్వాములుగా 13 ఐరోపా దేశాలు ఉన్నాయి.

Next Story