- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమ బెంగాల్ లో చెలరేగిన హింసాత్మక ఘటనపై బంగ్లాదేశ్ (Bangladeshi) వ్యాఖ్యలపై విదేశాంగ శాఖ స్పందించింది. అనవరసర వ్యాఖ్యలు చేయడానికి బదులుగా బంగ్లా తమ దేశంలోని మైనార్టీల హక్కులను కాపాడటంపై దృష్టి సారించాలని విదేశాంగ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ హితవు పలికారు. జైస్వాల్ (Randhir Jaiswal) స్పందిస్తూ.. ‘పశ్చిమబెంగాల్‌లో జరిగిన ఘటనలకు సంబంధించి బంగ్లా అధికారులు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. వారి వ్యాఖ్యలు అర్థరహితమైనవి. ఆ దేశంలోని మైనారిటీలపై జరుగుతున్న హింస గురించి భారత్ తన ఆందోళనను తెలుపుతోంది. ఈక్రమంలో వారు తిరిగి భారత్ పై ఇలాంటి నిందలు వేయడం మానుకోవాలి. ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి బదులు వారు తమ సొంత దేశంలో మైనారిటీల హక్కులను కాపాడటంపై దృష్టిసారిస్తే మంచిది’ అని పేర్కొన్నారు. అని ఆయన ఈవిధంగా బదులిచ్చారు.
బెంగాల్ హింస
బెంగాల్‌లోని పరిస్థితులపై బంగ్లాదేశ్ ప్రెస్ సెక్రటరీ షఫీకుల్ ఆలం ఇటీవల మాట్లాడారు. భారత్‌లోని మైనారిటీలను రక్షించేందుకు అక్కడి కేంద్రంతో పాటు పశ్చిమ్ బెంగాల్ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలన్నారు. దీనిపైనే విదేశాంగశాఖ స్పందించింది. కాగా.. వక్ఫ్ (సవరణ) చట్టానికి వ్యతిరేకంగా ముర్షిదాబాద్‌లో గత వారం నుంచి నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. మాల్దా, ముర్షిదాబాద్, సౌత్ 24 పరగణాలు, హుగ్లీ జిల్లాల్లో నిరసనకారులు పెద్దఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. నిరసనలు ఉద్రిక్తతగా మారడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు సహా పలువురికి గాయాలయ్యాయి. ఈ కేసులో ఇప్పటి వరకు 200 మందికి పైగా అరెస్టు చేశారు. దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట్లాడుతూ.. ఈ చట్టాన్ని బెంగాల్‌లో అమలుచేయబోమని పునరుద్ఘాటించారు. అయితే ఈ హింసలో ఉగ్రసంస్థల హస్తం ఉందని, వారే యువకులను రెచ్చగొట్టి దాడులకు పాల్పడేలా చేస్తున్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొంటున్నాయి.






