Congress: కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా సీనియర్ నేతలు..!

by Shamantha N |

కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నేతలు తలనొప్పిగా మారారు. నిన్నటివరకు శశిథరూర్ ఇప్పుడు సల్మాన్ ఖుర్షీద్(Salman Khurshid) కాంగ్రెస్ కేంద్రం తీసుకున్న నిర్ణయాలను కొనియాడారు.

Congress: కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా సీనియర్ నేతలు..!
X

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నేతలు తలనొప్పిగా మారారు. నిన్నటివరకు శశిథరూర్ ఇప్పుడు సల్మాన్ ఖుర్షీద్(Salman Khurshid) కాంగ్రెస్ కేంద్రం తీసుకున్న నిర్ణయాలను కొనియాడారు. జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించిన ఆర్టికల్ 370 రద్దుని ప్రశంసించారు. ఆపరేషన్‌ సిందూర్‌పై ఏర్పాటైన అఖిలపక్ష బృందంలో భాగంగా ఇండోనేసియాలో పర్యటించిన సందర్భంగా ఖుర్షీద్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘కశ్మీర్‌ చాలాకాలం ఒక పెద్ద సమస్యను ఎదుర్కొంది. ప్రత్యేక ప్రతిపత్తి కారణంగా కశ్మీర్ దేశంలోని మిగిలిన ప్రాంతాలతో వేరే అనే భావన కలిగించేది. కానీ ఆర్టికల్ 370ని రద్దు చేశారు. చివరకు ఆ భావనను అంతం చేశారు’’ అని అన్నారు. ఆ ప్రాంతంలో సానుకూల మార్పు, అభివృద్ధివైపు పయనానికి ఈ రద్దు దోహదం చేసిందనే అభిప్రాయం వ్యక్తంచేశారు. అక్కడ ఎన్నికలు జరిగాయని, 65 శాతం మంది ప్రజలు అందులో పాల్గొన్నారన్నారు. ఇప్పుడు అక్కడ ఎన్నికైన ప్రభుత్వం ఉందని అన్నారు. మరోవైపు,

గతంలో..

ఉగ్రవాదంపై పాకిస్థాన్ (Pakistan) అనుసరిస్తున్న విధానాన్ని ప్రపంచానికి చాటిచెప్పేందుకు భారత పార్లమెంటరీ అఖిలపక్ష ప్రతినిధి బృందాలు పలు దేశాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఇండోనేసియా, మలేసియా, దక్షిణ కొరియా, జపాన్‌, సింగపూర్ దేశాల్లో పర్యటిస్తోన్న బృందంలో సల్మాన్ ఖుర్షీద్ సభ్యుడిగా ఉన్నారు. కాగా.. కేంద్రంలో ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ప్రశంసించారు. 2019లో ఆర్టికల్‌ 370ని మోడీ ప్రభుత్వం రద్దు చేసింది. అయితే, ఆర్టికల్ 370 రద్దు సమయంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) ఈ చర్యను తీవ్రంగా వ్యతిరేకించింది. బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య నిబంధనలను, సమాఖ్య స్ఫూర్తిని దాటవేస్తోందని పార్టీ ఆరోపించింది. ఆర్టికల్ 370ని ఏకపక్షంగా మార్చలేమని సీనియర్ నాయకులు వాదించారు. కానీ, ఇప్పుడు దానికి విరుద్ధంగా ఇలాంటి ప్రకటన రావడం గమనార్హం.

Next Story