- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర విషాదం.. మాజీ ఐఏఎస్ అధికారి దుర్మరణం
దేశ రాజధాని ఢిల్లీలో మాజీ ఐఏఎస్ అధికారి ధనేంద్ర కుమార్ ప్రాణాలు విడిచారు.

దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లోని ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI) మొదటి చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనేంద్ర కుమార్ (Dhanendra Kumar) దుర్మరణంపాలయ్యారు. సౌత్ ఢిల్లీలోని హౌజ్ ఖాస్ ప్రాంతంలో ఉన్న తన నివాసంలో ఎయిర్ కండిషనర్ (AC) పేలడంతో దట్టమైన పొగ కారణంగా, ఊపిరాడక ఆయన కన్నుమూశారు. పోలీసుల కథనం మేరకు.. ధనేంద్ర కుమార్ తన ఇంట్లో ఉన్న సమయంలో ఏసీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో ఇల్లంతా దట్టమైన, విషపూరితమైన పొగ అలుముకుంది. అక్కడే ఉన్న ధనేంద్ర కుమార్ ఆ పొగను పీల్చడం వల్ల శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారి స్పృహ కోల్పోయారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఆయనను కాపాడి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆయన అప్పటికే మరణించినట్లుగా వైద్యులు ధృవీకరించారు.
ఉత్తమ బ్యూరోక్రాట్‌గా సేవలు..
1968 బ్యాచ్‌కి చెందిన హర్యానా క్యాడర్ ఐఏఎస్ అధికారి అయిన ధనేంద్ర కుమార్, దేశ పరిపాలనా వ్యవస్థలో ఎన్నో కీలక బాధ్యతలను నిర్వర్తించారు. కేంద్ర రక్షణ శాఖ ఉత్పత్తి విభాగం కార్యదర్శిగా, రోడ్డు రవాణా, రహదారుల శాఖ కార్యదర్శిగా పనిచేశారు. ప్రపంచ బ్యాంకులో భారత ప్రతినిధిగా కూడా సేవలు అందించారు. దేశంలో వ్యాపార పోటీతత్వాన్ని పర్యవేక్షించే అత్యున్నత సంస్థ ‘కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా’ (CCI)కి 2009 నుంచి 2011 వరకు మొదటి చైర్మన్‌గా వ్యవహరించారు. ధనేంద్ర కుమార్ ఆకాల మృతి పట్ల పలువురు ప్రముఖులు, ఐఏఎస్ అధికారులు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.






