- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Air India : మరో ఎయిర్ ఇండియా విమానంలో సమస్య
అహ్మదాబాద్ ఘోర విమాన ప్రమాదం(Ahmedabad Plane Crash) విషాదం మరవక ముందే మరో ఎయిర్ ఇండియా విమానం(Air India Flight)లో సాంకేతిక లోపం తలెత్తింది.

దిశ, వెబ్ డెస్క్ : అహ్మదాబాద్ ఘోర విమాన ప్రమాదం(Ahmedabad Plane Crash) విషాదం మరవక ముందే మరో ఎయిర్ ఇండియా విమానం(Air India Flight)లో సాంకేతిక లోపం తలెత్తింది. మరోవైపు ఎయిర్ ఇండియా విమానాల్లో తరుచూ సాంకేతిక సమస్యలు తలెత్తడం తీవ్ర ఆందోళనలు రేకెత్తిస్తోంది. తాజాగా ఢిల్లీ-రాంచీ ఎయిర్ ఇండియా విమానం(Delhi-Ranchi Air India Flight)లో సాంకేతిక సమస్య ఉన్నట్టు పైలట్ గుర్తించారు. ఢిల్లీ ఎయిర్ పోర్టు నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపట్లోనే ఈ సమస్యను గుర్తించిన పైలట్.. దాన్ని వెంటనే వెనక్కి మళ్లించి, ఢిల్లీ ఎయిర్పోర్టులో సేఫ్ గా ల్యాండ్ చేశాడు.
ప్రయాణికులను సురక్షితంగా కిందికి దించి, సమస్యను సరిచేస్తున్నారు నిపుణులు. కాగా ఈరోజు స్విట్జర్లాండ్ లోని జ్యూరిచ్ నుంచి ఢిల్లీ రావాల్సిన ఎయిర్ ఇండియా బోయింగ్ విమానంలో కూడా సాంకేతిక సమస్య తలెత్తింది. కాగా.. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జూన్ 12న ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ (విమానం AI-171) టేకాఫ్ సమయంలో కుప్పకూలి 274 మంది మరణించిన సంగతి తెలిసిందే.






