- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వివాదస్పదంగా మారిన లేడీ ఎక్సైజ్ అధికారి డ్యాన్స్.. (వీడియో)

దిశ, వెబ్‌డెస్క్ : వికలాంగుల కోటాలో ప్రభుత్వ ఉద్యోగం పొందిన ఓ మహిళా ఉద్యోగి చేసిన డ్యాన్స్ ప్రస్తుతం వివాదంగా మారింది. డిజబుల్డ్ సర్టిఫికెట్ పెట్టి ఇటీవలే ఎక్సైజ్ శాఖలో విధులు చేపట్టిన ఆమె.. యువకులతో కలిసి స్టేజీపై డ్యాన్స్ చేసిన వీడియోలతో ఆమె వికలాంగురాలేనా అనే అనుమానం ప్రజల్లో వచ్చింది. దీంతో ఓ విద్యార్థి సంస్థ ఫిర్యాదుతో సర్కార్ విచారణకు ఆదేశించింది. మధ్యప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇటీవల ప్రియాంక కదమ్ అనే యువతి వికలాంగుల కోటా కింద ఎక్సైజ్ శాఖలో ఉద్యోగం సాధించింది. జిల్లా ఎక్సైజ్ అధికారిగా ఎంపికైన ఆమె గత శుక్రవారం ఓ వేడుకలలో యువకులతో కలిసి డ్యాన్స్ చేసింది. ఈ వీడియో వైరల్ కావడంతో ప్రియాంక కదమ్ వికలాంగురాలు కాదని.. ఆమె చక్కగా డ్యాన్స్ చేస్తుందని, ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగం సాధించిందని, వెంటనే ఆమెను జాబ్ నుంచి తొలగించాలని ఓ విద్యార్థి సంఘం నేతలు ప్రభుత్వ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన అధికారులు ఆమె ఉద్యోగ నియాకకంపై ఎంక్వైరీకి ఆదేశించారు. అంతేకాక ప్రియాంక కదమ్ జిల్లా ఎక్సైజ్ అధికారిని తొలగించి ఉజ్జయినిలోని ట్రెజరీ అండ్ అకౌంట్స్ విభాగంలో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్‌గా నియమించారు. విచారణ పూర్తయ్యే వరకు ఆమెకు జిల్లా ఎక్సైజ్ అధికారి పోస్ట్ ఇచ్చేది లేదని తేల్చి చెప్పింది. అలాగే వికలాంగుల కోటా కింద ఎంపికైన అభ్యర్థులందరినీ భోపాల్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) వైద్యులు వారి సర్టిఫికేట్‌లను ధృవీకరించాలని కోరారు.
ఈ వివాదంపై ప్రియాంక కదమ్ స్పందించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని ఆమె కుండబద్దలు కొట్టారు. నేను సాధారణ మధ్య తరగతి కుటుంబం నుంచి కష్టపడి చదివి జీవితంలో ఈ స్థానానికి వచ్చానని తెలిపారు. 2017లో బాత్‌రూమ్‌లో పడిపోవడంతో తన తుంటికి తీవ్ర గాయమైందని తెలిపింది. MRI స్కాన్‌లో ‘అవాస్కులర్ నెక్రోసిస్’ ఉందని తేలిందని, ఆ తర్వాత నాలుగు సార్లు శస్త్రచికిత్స జరిగిందని ప్రియాంక కదమ్ చెప్పారు. తనకు 45 శాతం వైకల్యం ఉందన్న ప్రియాంక కదమ్.. తొలిసారి చూసిన వారికి నేను వికలాంగురాలిగా కనిపించకపోవచ్చన్నారు. సంక్లిష్టమైన శస్త్రచికిత్స సమయంలో అమర్చిన ఇంప్లాంట్ల వల్ల నడవగలుగుతున్నానని వివరించారు. వైద్యులు సూచన మేరకు ఐదు నుంచి పది నిమిషాలపాటు డ్యాన్స్ చేయగలనని, ఇదే సమయంలో కొన్నిసార్లు నొప్పి నివారణ మందులు కూడా వాడుతుంటానని చెప్పారు. మానసిక స్థైర్యాన్ని పెంచుకోవడానికి డ్యాన్స్ చేస్తానని ప్రియాంక కదమ్ స్పష్టం చేశారు. కాగా ఈ వివాదం స్పందించించేదుకు ఆ శాఖ అధికారులు ఎవరూ ముందుకు రాలేదు.






