- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేహాన్ ఎంగేజ్‌మెంట్‌పై ప్రియాంకగాంధీ ఇంట్రెస్టింగ్ పోస్ట్
రేహాన్- అవీవాల ఎంగేజ్‌మెంట్‌పై ప్రియాంకగాంధీ ఇన్ స్టాలో ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశారు. ఇద్దరూ 3ఏళ్ల వయసు నుంచి ఫ్రెండ్స్.

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు, ఎంపీ ప్రియాంకగాంధీ వాద్రా - రాబర్ట్ వాద్రాల కుమారుడు రేహాన్ వాద్రాకు ఇటీవలే ఎంగేజ్‌మెంట్ జరిగినట్లు నేషనల్ మీడియాలో ఇటీవల పలు కథనాలు వెలువడ్డాయి. ఈ వార్తలపై ప్రియాంక కుటుంబం వెంటనే స్పందించలేదు. తాజాగా కుమారుడి ఎంగేజ్‌మెంట్ పై ప్రియాంక గాంధీ సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశారు. రేహాన్, అవీవా బేగ్ ల ఎంగేజ్‌మెంట్‌ను ధృవీకరిస్తూ.. వారి చిన్ననాటి ఫొటో, ప్రస్తుత ఫొటోలను షేర్ చేశారు. వారిద్దరి వయసు 3 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ అని ఆ పోస్ట్ కింద రాసుకొచ్చారు. ఇద్దరూ ఎప్పుడూ ఇలాగే ఒకరినొకరు ప్రేమించుకుంటూ గౌరవించుకోవాలని ఆకాంక్షించారు. ఈ పోస్ట్ పై నెటిజన్లు స్పందిస్తూ.. కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఎవరు ఈ అవీవా బేగ్?
ఇక ప్రియాంకగాంధీ వాద్రాకు కాబోయే కోడలు అవీవా బేగ్ విషయానికి వస్తే.. ఆమె ఒక ఫొటోగ్రాఫర్. ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీలో జర్నలిజం పూర్తి చేసింది. అటెలీర్ 11 అనే ఫొటోగ్రఫీ సంస్థకు కో ఫౌండర్ గా పనిచేస్తోంది. అవీవాకు జంతువుల పట్ల అమితమైన ప్రేమ. తరచూ హార్స్ ఫామ్ కు వెళ్తుంది. ఆమె మంచి ఫుడ్ లవర్ కూడా. వెకేషన్ కు వెళ్లినపుడు ఫుడ్ ను ఎంజాయ్ చేయడమే కాకుండా.. వాటి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి, వాటి గురించి వివరిస్తుంటుంది. ప్రియాంకగాంధీకి కాబోయే కోడలంటూ వార్తలు రావడంతో సోషల్ మీడియాలో ఈమె గురించి తెగ సెర్చ్ చేస్తున్నారు. రేహాన్ కు వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీ ఇష్టం. వీరిద్దరి అభిరుచులు కలవడంతోనే ప్రేమలో పడి, పెళ్లి చేసుకోబోతున్నారు.






