- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అందరూ రాహుల్ గాంధీ ప్రెస్‌మీట్ చూడాలని పియాంక గాంధీ రిక్వెస్ట్
ఈ రోజు ఢిల్లీలోని ఇందిరా భవన్ లో లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచనల ప్రెస్ మీట్ పెట్టిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: ఈ రోజు ఢిల్లీలోని ఇందిరా భవన్‌లో లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) సంచనల ప్రెస్ మీట్ (Press meet) పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రెస్ మీట్ అందరూ తప్పకుండా చూడాలని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ (MP Priyanka Gandhi) రిక్వెస్ట్ చేశారు. గత కొద్ది రోజులుగా కేరళలోని తన వయనాడ్ నియోజకవర్గంలో పర్యటిస్తున్న ఆమె.. ఈ రోజు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. "మన దేశంలో ఏమి జరుగుతుందో మీరు అర్థం చేసుకోవాలి కాబట్టి రాహుల్ గాంధీ విలేకరుల సమావేశాన్ని అందరూ చూడాలని నేను కోరుతున్నాను.
ఎన్నికల ప్రక్రియను నాశనం చేయడానికి, మన దేశంలో ప్రజాస్వామ్యాన్ని సవాలు చేయడానికి EC కుట్ర పన్నుతోంది. మనం ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, మన దేశం కోసం పోరాడాలి..." అని ఈ సందర్భంగా ప్రియాంక గాంధీ చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే రాహుల్ గాంధీ ఇందిరా భవన్ లో మాట్లాడుతూ.. ఓట్ల దొంగతనంతోనే దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చందని ఆరోపించారు. తాను పేల్చబోయే ‘హైడ్రోజన్ బాంబు’ను చూసి బీజేపీ నేతల్లో వణుకు మొదలైందని అన్నారు. ‘ఓట్ చోరీ’ పార్టీని రాబోయే రోజుల్లో ఎలాగైన గద్దె దింపుతామని అన్నారు. ఆయా రాష్ట్రాల్లో వివిధ ఫోన్ నెంబర్‌ల ద్వారా అక్రమంగా ఓట్లను తొలగించారని పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో రాహుల్ గాంధీ వివరించారు.






